Leading News Portal in Telugu

Health Tips : పోటాటో చిప్స్ తెగ తింటున్నారా? ఇది మీకోసమే..


Health Tips : పోటాటో చిప్స్ తెగ తింటున్నారా? ఇది మీకోసమే..

పోటాటో చిప్స్ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరేమో.. ఉప్పంగా, కారంగా ఉండటమే కాదు.. రుచిగా కూడా ఉండటంతో చిన్నా,పెద్దా అందరు తినడానికి ఇష్ట పడతారు.. అయితే వీటిని ఎక్కువగా తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు పొటాటో చిప్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


వారానికి ఒకసారి తింటే పర్లేదు కానీ అదే పనిగా తింటే మాత్రం హానికరం అని అంటున్నారు.అదేపనిగా నూనెలో వేగించిన స్నాక్స్‌ను తీసుకుంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయని నిపుణులు అంటున్నారు.. నూనెలో బాగా వేయించడం వల్ల నోటికి రుచిగా ఉంటుంది అంతే.. వీటిలో ఎటువంటి పోషకాలు ఉండవు.. నూనెలో వేగించటం వలన వాటిలో ఉండే పోషకాలు నశిస్తాయి.అందువల్ల ఈ ఆహారాలకు బదులు సలాడ్స్ తింటే మంచిది.. శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి..

హైఫ్యాట్ కెలోరీలు ఉండుట వలన అదే పనిగా తింటూ ఉంటే అధిక బరువు పెరిగి ఊబకాయానికి దారి తీస్తుంది. ముఖ్యంగా బంగాళాదుంప చిప్స్ ద్వారా ఈ సమస్య అధికం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.చిప్స్ లో సోడియం అధిక మొత్తంలో ఉండుట వలన రక్తపోటు పెరుగుతుంది.. ఇక రోజూ తీసుకోవడం వల్ల ఒంట్లో కొవ్వు బాగా పెరిగిపోతుందని చెబుతున్నారు.. డీప్- ఫ్రై చేయడం ద్వారా చిప్స్‌లో ట్రాన్స్‌ఫాట్ పెరుగుతుంది.ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.వేగించిన ఆహారాలలో ట్రాన్స్ ఫాట్స్ ఎక్కువగా ఉంటాయి.ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయుల్ని పెంచుతాయి.. నూనెలో వేయించిన ప్రతి వంటలో, స్నాక్స్ లో కేలరీలు అధికంగానే ఉంటాయి.. వీటిని తీసుకోవడం కంటే ఫ్రెష్ కూరగాయలను తీసుకోవడం మంచిది..