
అమ్మాయిల ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవ్వరికి తెలియదు.. ఏ కవి అయినా అందాన్ని పొగిడారు కానీ మనస్తత్వం గురించి చెప్పలేదు.. అయితే అబ్బాయిల విషయంలో మాత్రం కొన్ని ప్రత్యేకతలు ఉంటేనే ఇష్టపడుతున్నారు.. కొన్ని సర్వేల్లో తేలిన విషయం ఏంటంటే అబ్బాయిల్లోని కొన్ని అంశాలు అమ్మాయిలని బాగా ఇంప్రెస్ చేస్తాయి.. అసలు ఆలస్యం చెయ్యకుండా అవేంటో ఒకరి చూసేద్దాం…
అబ్బాయిలకి మంచి పొడవైన జుట్టు చక్కని హెయిర్ స్టైల్ స్టైల్ ఉంటే ఇట్టే ఇంప్రెస్ అవుతారు. అందుకే, ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకుని నీట్‌గా ఉండటానికి ట్రై చెయ్యండి..
డ్రెస్సు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.. మగవారు అమ్మాయిలు ఎంత బాగా రెడీ అయితే ఇష్టపడతారో అమ్మాయిలు కూడా అంతే మగవారు కూడా మంచి డ్రెస్ సెన్స్ ఉండే అబ్బాయిల్ని ఇష్టపడతారు.. ఎక్కువగా ఫార్మల్ ను ఇష్టపడతారు..
పొట్ట, బట్ట ఉంటే అమ్మాయిలు ఇష్టపడటం కష్టమే.. ఎక్కువగా ఫిట్ గా ఉన్న అబ్బాయిలను లైక్ చేస్తున్నారు. అలాగే కొంతమంది సిక్స్ ఫ్యాక్ ఉన్న అబ్బాయిలను ఇష్ట పడుతున్నారు..
అదే విధంగా మగవారు ఎప్పుడు కూడా మెచ్యూర్డ్‌గా ఉంటేనే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు. వారు స్ట్రిక్ట్‌గా చేసే ప్రతి విషయంలోనూ సిల్లీగా కాకుండా హుందాగా వ్యవహరించే మగవారంటే అమ్మాయిలకి ఎప్పుడూ ఇష్టమే..
ఇంకొందరు చలాకీ ఉంటూ అందరితో కలిసిపోయే అబ్బాయిలను ఇష్ట పడతారు.. అలాగే జీవితంను ఒక్క ప్లాన్ ప్రకారం వెళ్లేవాళ్లను బాగా ఇష్టపడతారు.. అమ్మాయిల విషయంలో అబ్బాయిలు ఎలా అయితే ఆలోచిస్తారో, అమ్మాయిలు కూడా అబ్బాయిలను ఒక లెక్క ప్రకారమే ఇష్టపడతారు..