Leading News Portal in Telugu

Zomato: ప్రాణప్రతిష్ఠ వేళ నాన్‌వెజ్‌ను తాత్కాలికంగా నిలిపివేసిన జొమాటో..


Zomato: ప్రాణప్రతిష్ఠ వేళ నాన్‌వెజ్‌ను తాత్కాలికంగా నిలిపివేసిన జొమాటో..

Non Vegetarian Food: అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట రోజు (సోమవారం) ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న ( జనవరి 22న) పలు ఉత్తరాది రాష్ట్రాల్లో నాన్‌వెజ్‌ డెలివరీలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించింది. అయితే, సోమవారం రోజు శ్రీరామ జన్మభూమి అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామాలయంలో శ్రీరాముడు బాలావతారంలో కొలువుదీరాడు. ఈ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా పలు రాష్ట్రాలు మాంసం విక్రయాలను నిషేదం విధించాయి. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఓ కస్టమర్‌ చికెన్‌ కోసం జొమాటో యాప్‌లో
సెర్చ్ వేయగా.. నాన్‌వెజ్‌ ఫుడ్‌ అందుబాటులో కనిపించలేదు..


దీంతో అతడు ‘ఈరోజు (జనవరి 22న) భోపాల్‌లో జొమాటో సంస్థ చికెన్‌ డెలివరీ చేయడం లేదు’ అని ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. అయితే, జొమాటో దీనికి సమాధానం ఇస్తూ.. ప్రాణ ప్రతిష్ట సమయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నాన్‌ వెజ్‌ను తాత్కాలికంగా నిషేధించినట్లు వెల్లడించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్తరప్రదేశ్‌, అస్సాం, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో నాన్‌వెజ్‌ను డెలివరీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇక, జొమాటో నిర్ణయంపై సర్వత్రా ప్రసంశలు వస్తున్నాయి.