Leading News Portal in Telugu

Potato Health Issues : ఆలూ తింటే క్యాన్సర్ వస్తుందా? ఏది నిజం?


Potato Health Issues : ఆలూ తింటే క్యాన్సర్ వస్తుందా? ఏది నిజం?

మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణంలో జరుగుతున్న మార్పుల వల్ల అనేక రకాల కొత్త సమస్యలు వస్తుంటాయి.. ముఖ్యంగా ఈరోజుల్లో క్యాన్సర్ బారిన పడే వారిసంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. అయితే కొన్ని రకాల ఆహారాలు తింటే ముందుగానే క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడొచ్చు. కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల కూడా కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు..


అందులో ఆలూ కూడా ఒకటి.. ఎన్నో రకాల స్నాక్స్ చేసుకొనే ఈ ఆలూను తీసుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయని గతంలో చాలా సార్లు మనం చెప్పుకున్నాం.. పిండి పదార్థం ఎక్కువగా ఉండే దుంప కావడంతో వండే విధానంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.. తాజాగా నిర్వహించిన కొన్ని సర్వేల్లో ఆలూ తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి..

అవును మీరు విన్నది అక్షరాల నిజం.. ఆలూలో ఆక్రిలామైడ్ అనే రసాయనం ఉంటుంది. కాబట్టి వీటిని కొన్ని రకాల చక్కెరలతో అధిక ఉష్ణోగ్రత వద్ద కాల్చడం వల్ల క్యాన్సర్ వస్తుంది.. అందుకే వీటిని తీసుకొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే.. నిద్ర అనేది ఖచ్చితంగా ఉండాలి. సరైన నిద్ర ఉంటే.. రొమ్ము, పెద్దప్రేగు, అండాశయాలు, ప్రోస్టేట్ క్యాన్సర్‌లు రాకుండా ఉంటాయి. అదే విధంగా క్యాన్సర్‌ను నివారించే ఆహారాలు తీసుకోవడం కూడా అవసరం.. పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం చాలా మంచిది..