Leading News Portal in Telugu

Weight Loss Tips : దాల్చిన చెక్కను రోజూ తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?


Weight Loss Tips : దాల్చిన చెక్కను రోజూ తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

అధిక బరువు ఇప్పుడు అందరికీ ఇబ్బందిగా మారింది.. అధిక బరువు కారణంగా సరైన దుస్తులు వేసుకోలేరు.. అలాగే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.. చలికాలంలో బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు.. ఎందుకంటే సరిగ్గా వర్కౌట్స్ ఉండవు… తొందరగా నిద్ర కూడా లేవలేరు.. రోజూ వ్యాయాయం, సరైన ఆహారపు అలవాట్లను పెట్టుకుంటే బరువు తగ్గవచ్చునని చెబుతున్నారు.. దాల్చిన చెక్కను కూడా రెగ్యులర్ గా తీసుకుంటే అనేక రకాల సమస్యల నుంచి కూడా బయటపడవచ్చునని చెబుతున్నారు.. ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో తెలుకుందాం..


రక్తంలో చక్కెర స్థాయిలు , కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. అంతేకాదు ఆహారంలో దాల్చిన చెక్క తీసుకుంటే త్వరగా బరువు తగ్గవచ్చు.. దీంట్లో ఎక్కువగా యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.. జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.. దాంతో మలబద్ధకం సమస్యలు దరి చేరవు..

మాంసం కూరలను తీసుకోవడం వల్ల అవి త్వరగా జీర్ణం కావు.. వాటిలో కొంచెం దాల్చిన చెక్క ను యాడ్ చెయ్యడం వల్ల బరువు తగ్గొచ్చంటున్నారు. అలాగే దాల్చిన చెక్కను పొడి చేసుకొని వేడి నీళ్లల్లో వేసి టీలాగా చేసుకొని తాగితే చాలా మంచిది.. బరువు త్వరగా తగ్గవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. వేడి నీటిలో అల్లం రసం, తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి కలిపి తాగాలి. లంచ్ లేదా డిన్నర్ తర్వాత ఈ నీటిని తాగితే బరువు తగ్గడం ఖాయం.. ఇదనే కాదు ఏదొక రూపం తీసుకోవడం వల్ల బరువు త్వరగా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..