
ఈ మధ్య ఎక్కువగా జనాలు జంక్ ఫుడ్స్ ను ఎక్కువగా తింటున్నారు.. రుచిగా ఉంటున్నాయని వాటినే ఎక్కువగా తింటున్నారు.. అందులో పిజ్జా కూడా ఒకటి.. పేరు వినగానే చాలా మందికి నోరు ఊరిపోతుంది కదూ.. చీజ్ ఎక్కువగా ఉంటుంది.. అందుకే ఎక్కువగా దీన్ని ఇష్టపడుతారు. సెలబ్రేషన్ ఏదైనా సరే పిజ్జాలు ఖచ్చితంగా ఉంటుంన్నాయి. కేవలం యువత మాత్రమే కాదు. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు.. అయితే ఎప్పుడో ఒక్కసారి తీసుకుంటే ఓకే గానీ రోజూ తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పిజ్జాను తరుచుగా తినడం వల్ల ఎదురయ్యే సమస్యల్లో డయాబెటీస్ కూడా ఒకటి. పిజ్జా తినడం వల్ల బ్లడ్‌లో షుగర్ స్థాయిలు పెరిగి.. క్రమంగా మధుమేహంగా మారుతుంది.. బీపి, అల్సర్లు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.. ఈ పిజ్జాను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు..
వీటిలో వివిధ రకాల ప్రొసెడ్డ్ ఫుడ్స్ కలిపి ఉండటం వల్ల.. హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి.. దాంతో గుండె సంబందించిన సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. అలాగే అధిక కొవ్వు ప్రాసెస్ చేయబడిన పిజ్జా లాంటి ఆహారం తినడం వల్ల కడుపు, ప్రేగు క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అంతే కాకుండా విపరీతంగా బరువు పెరిగి పోతున్నారు. దీని వల్ల ఇతర సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి.. అందుకే టేస్ట్ బాగుంది కదా అని రోజూ తింటే ఇక మీ ప్రాణాలు గాల్లో కలిసి పోతాయి.. బీ కేర్ ఫుల్ మిత్రమా..