అమ్మాయిలు అందంగా ఉండాలని కోరుకుంటారు.. అందులో చాలా మంది గోర్లను కూడా అందంగా చేసుకోవాలని అనుకుంటారు.. గోర్లకు షేప్ చెయ్యడంతో పాటుగా ఆకర్షనీయమైన రంగులతో నైల్ పాలిష్ లను వాడుతుంటారు.. అయితే రకరకాల నెయిల్ పాలిష్ లను ఎక్కువగా వాడటం వల్ల అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. రోజుకో కలర్ ను వాడితే ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
నెయిల్ పాలిష్ ఎక్కువగా వేసుకోవటం వలన బరువు పెరిగే అవకాశం ఉందట. నెయిల్ పాలిష్ కి బరువుకి సంబందం ఏమిటా అని ఆలోచిస్తున్నారు కదూ.. అవును మీరు విన్నది అక్షరాల నిజం.. నిపుణులు అదే చెబుతున్నారు.. నెయిల్ పాలిష్ ఎక్కువ రోజులు మన్నెందుకు ట్రైఫెనైల్ ఫాస్పేట్ అనే రసాయనం కలుపుతారు. ఈ రసాయనం ప్రతి నెయిల్ పాలిష్ లోనూ ఉంటుంది. నెయిల్ పాలిష్ వేసుకున్నప్పుడు ఏదో ఒక సమయంలో చర్మం మీద పడుతుంది.
అలా పడినప్పుడు నెయిల్ పాలిష్ లో ఉండే ట్రైఫెనైల్ ఫాస్పేట్ రసాయనం బాడీలోని పలు హార్మోన్ లపై ప్రభావాన్ని చూపిస్తుంది.. అలా హార్మోన్ల పై ప్రభావాన్ని చూపడం వల్ల బరువు పెరుగుతారు. అలాగే గర్భదరణ సమయంలో నెయిల్ పాలిష్ లకు దూరంగా ఉంటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ఇది కడుపులోని బిడ్డపై ప్రభావాన్ని చూపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..