
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.. అయితే బరువు పెరిగితే అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి.. అధిక బరువు కారణంగా మనం అనేక ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. గుండె జబ్బులతో పాటు అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం అధిక బరువేనని నిపుణులు చెబుతున్నారు. కనుక అధిక బరువు కలిగిన వాళ్లు డైట్ లో కొన్ని దాన్యాలను చేర్చుకోవడం చాలా మంచిదని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఒక్కసారి చూసేద్దాం..
కొర్రలు.. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఒక కప్పు క్వినోవాలో 120 కేలరీల శక్తి ఉంటుంది. దీనిలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. చాలా తక్కువ సమయంలో దీనిని వండుకోవచ్చు. క్వినోవా ధాన్యాన్ని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువగా ఆకలి వేయకుండా ఉంటుంది కనుక వేగంగా బరువు తగ్గవచ్చు. ఇక అధిక ఫైబర్ ఉండే ధాన్యాలల్లో బార్లీ కూడా ఒకటి. దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి..
ఇక బార్లీ ని నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది.. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాల్లో బుక్వీట్ కూడా ఒకటి. ఒక కప్పు బుక్వీట్ లో 155 కేలరీల శక్తి ఉంటుంది. ఇందులో గ్లూటెన్ తక్కువగా ఉండడంతో పాటు మట్టి రుచిని కలిగి ఉంటుంది. గంజి, పాన్ కేక్ వంటి వాటిలో దీనిని ఉపయోగించవచ్చు.. అదే విధంగా జొన్నలను కూడా తీసుకోవచ్చు.. జొన్నలల్లో తక్కువ క్యాలరీల శక్తి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల చాలా సమయం వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు జొన్నలతో అన్నం, సంగటి, జావ వంటి వాటిని తయారు చేసి తీసుకోవచ్చు. ఇక టెఫ్ అనే చిన్నరకం ధాన్యాలను తీసుకోవడం వల్ల కూడా మనం వేగంగా బరువు తగ్గవచ్చు.. అలాగే రాగులు కూడా తీసుకోవచ్చు.. ధాన్యాలను తీసుకోవడం వల్ల మనం సులభంగా బరువు తగ్గడంతో పాటు శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.. జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి..