Leading News Portal in Telugu

Masterdating: యువతలో కొత్త “డేటింగ్” ట్రెండ్.. అసలు ‘‘మాస్టర్ డేటింగ్’’ అంటే ఏమిటి..?



Masterdating

Masterdating: ‘డేటింగ్’ నేటి యువతకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అమ్మాయిలు, అబ్బాయిలు తమ రిలేషన్‌షిప్‌లో ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు డేటింగ్ చేసుకోవడం చాలా కామన్. అయితే, ప్రస్తుతం యువత కొత్త డేటింగ్ ట్రెండ్‌కి తెరతీసింది. ‘‘ మాస్టర్ డేటింగ్’’ అనే కొత్త డేటింగ్‌లో మునిగితేలుతున్నారు. సోషల్ మీడియాలో ఈ పదం ట్రెండింగ్‌లో ఉంది. మాస్టర్ డేటింగ్ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్ అవుతోంది. అంశంపై 1.6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. మాస్టర్ డేటింగ్‌లో తమ అనుభవాలను పంచుకుంటున్నారు. అయితే, ఇది డేటింగ్‌తో పోలిస్తే చాలా భిన్నం. Gen Z యువత ఈ కొత్త డేటింగ్ ‘‘మాస్టర్ డేటింగ్’’ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

మాస్టర్ డేటింగ్ అంటే ఏమిటి..?

మాస్టర్ డేటింగ్‌లో ఒక వ్యక్తి తనను తాను ప్రేమగా, కేరింగ్‌గా చూసుకోవడమే. వ్యక్తులు తమకు తాము ఖరీదైన రెస్టారెంట్లకి వెళ్లడం, మార్స్, బార్స్, పార్కులు, మ్యూజియంలు ఇలా మొదలైన వాటికి వెళ్తుంటారు. స్పాలో తమను తాము ఎంజాయ్ చేస్తుంటారు. తమకు తాము ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు.

నిజానికి ఇది ఒక వ్యక్తి తనను తాను ప్రేమించుకోవడం, శ్రద్ధగా చూసుకునే ఒక పద్ధతి కావచ్చు. అయితే, ఇది మీకు జీవితంతో ఎవరూ లేరని, మీరు ఒంటరిగా ఉన్నరనే అర్థం కాదు, సెల్ఫ్-లవ్, సెల్ఫ్-కేర్ గా చూసుకోవడం. మిమ్మల్ని మీరు ముందుగా ప్రేమించకపోతే, వేరే వారిని ఎలా ప్రేమిస్తారనే భావన ‘‘మాస్టర్ డేటింగ్’’లో కీలకమైంది.

ఈ డేటింగ్ ద్వారా మీకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు, మీ ఇష్టాలు, అవసరాలను తెలుసుకుంటారు, మీ భావాలను విశ్లేషించుకుని, మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకుంటారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని మరింగా పెంచుతుంది. ప్రపంచాన్ని ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యాన్ని మీలో పెంచుతుంది.

మాస్టర్ డేటింగ్ అవసరం ఏంటీ..?

నిజానికి మనకు ఏం కావాలి, మన అవసరాలు ఏంటీ అని తెలుసుకున్నప్పటికీ, పాటించడం చాలా అరుదు. మనం అందరి చేత ప్రేమించబడాలని అనుకుంటాము, దీనికి ముందు వేరే వారి నుంచి ప్రేమ ఆశించే ముందు మనల్ని మనం ప్రేమించడం, బాధ్యతగా చూసుకోవడం చాలా ముఖ్యం.

ఎవరైనా రెస్టారెంట్‌లో ఒంటరిగా భోజనం చేయడం, థియేటర్‌కి వెళ్లి సినిమా చూడటం వంటివి చేస్తే, మనకు ఎవరూ తోడుగా లేరనే ఆలోచన, విచారం మనలో వ్యక్తం అవుతుంది, అయితే మనం ఎందుకు ఇలా ఆలోచించాలి..? ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఒంటరిగా సినిమా చూడటం, రెస్టారెంట్‌లో భోజనం చేయడం ఎందుకు సాధారణం కాదనే ప్రశ్న ఉద్భవిస్తుంటుంది. వీటన్నింటికి సమాధానమే ఈ ‘‘మాస్టర్ డేటింగ్’’. దీని ద్వారా మనల్ని మనం సంతోషంగా ఉంచుకోవడం దీని ప్రధాన ఉద్దేశం.