
ఈరోజుల్లో చాలా మందికి బద్ధకం బాగా పెరిగిపోయింది.. వేడి వేడిగా ఆహారం చేసుకొనే ఓపిక లేకపోవడంతో ఒక్కసారి వండుకొని రెండు మూడు రోజులు వేడి చేసుకొని తింటున్నారు.. ఇలా తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. ఆహారాన్ని మళ్లీ వేడి చేయడం వల్ల దానిలోని పోషకాలు నాశనం కావడమే కాకుండా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అనేక రసాయనాలు విడుదలవుతాయి.. అలా వేడి చెయ్యకూడని ఆహారాలు ఏంటో ఒక్కసారి చూసేద్దాం..
ఆలూను వేడి వేడిగా తింటేనే చాలా బాగుంటుంది.. ఆలూతో చేసిన వంటకాలను మళ్లీ వేడిచేయకూడదు. అలా చేస్తే అందులో క్లోస్ట్రిడియం బోటులినమ్ అనే బ్యాక్టీరియా పెరుగుతుంది. వేడి చేయడం ద్వారా వాటిల్లో ఉండే బి-6, పొటాషియం, విటమిన్-సి విచ్చిన్నం అవుతాయి.. సో ఇది తప్పక గుర్తుంచుకోవాలి..
సాదారణంగా చికెన్ ఎంత రుచికరమైనదో, మరుసటి రోజు వేడి చేసుకునే తింటే అంతే ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. ఈ వంటకాన్ని రిఫ్రిజిరేటర్ నుండి తీసి వేడి చేసినప్పుడు, దాని ప్రోటీన్ పూర్తిగా మారిపోతుంది.. ఇక జీర్ణ సమస్యలు కూడా వస్తాయి.. అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి..
మనం బజ్జీ, పకోడీలను డీప్ ఫ్రై చేసిన వస్తువుల కోసం పాన్‌లో ఎక్కువ నూనె వేస్తాము. ఆపై మిగిలిన నూనెను మళ్లీ వేడి చేసి వాడతారు.. అది యమ డేంజర్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు..
అలాగే ఆకు కూరలతో చేసిన ఏ వంట అయిన కూడా మళ్లీ, మళ్లీ వేడి చేస్తే డేంజరే.. పోషకాలు పోతాయి.. దాంతో అవి తిన్నా పెద్దగా ప్రయోజనం లేదని నిపుణులు చెబుతున్నారు..విన్నారుగా వీటిని ఎట్టి పరిస్థితులలో వేడి చేసుకోకండి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.