Leading News Portal in Telugu

IISc: ఐఐఎస్సీ సైంటిస్టుల ఘనత.. “పాము విషానికి” సింథటిక్ యాంటీబాడీ తయారీ.. పరీక్ష, లాభాలు ఇవే..



Snake Bite

synthetic antibody For snakebite toxin: దేశంలో పాము కాటుల వల్ల ప్రతీ ఏడాది వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం పాము విషాన్ని తటస్థీకరించి, ప్రాణాలను కాపాడేందుకు సాంప్రదాయ పద్ధతుల్లో ఉత్పత్తి చేస్తున్న ‘యాంటీ స్నేక్ వీనమ్’ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, తాజాగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(IISc) శాస్త్రవేత్తలు ఒక కృత్రిమ మానవ యాంటీబాడీని అభివృద్ధి చేసి చరిత్ర సృష్టించారు. ఇది సాంప్రదాయ స్నేక్ వీనమ్‌ని ఎదుర్కొనే మందులతో పోలిస్తే అత్యంత సమర్థవంతమైందిగా చెప్పారు. ఇది ఎలాపిడే కుటుంబానికి నాగుపాము, కింగ్ కోబ్రా, క్రైట్, బ్లాక్ మాంబా వంటి అత్యంత విషపూరితమైన పాముల విషాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు.

IISc యొక్క స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మరియు సెంటర్ ఫర్ ఎకోలాజికల్ సైన్సెస్ (CES)లోని ఎవల్యూషనరీ వెనోమిక్స్ ల్యాబ్ (EVL) బృందం కొత్తగా విషాన్ని తటస్థీకరించే యాంటీబాడీలను సంశ్లేషణ చేయడానికి HIV మరియు Covid-19కి వ్యతిరేకంగా ప్రతిరోధకాలను పరీక్షించడానికి గతంలో ఉపయోగించిన విధానాన్ని అనుసరించింది. ఇలా పాముకాటు విషాన్ని తట్టుకనేందుకు కొత్త వ్యూహాన్ని అమలు చేయడం ఇదే మొదటిసారని EVL, CESలో PhD విద్యార్థి , ‘సైన్స్ ట్రాన్స్‌లేషనల్ మెడిసిన్’లో ప్రచురించబడిన అధ్యయనం యొక్క సహ రచయిత సెంజి లక్ష్మే RR చెప్పారు.

ఇప్పటి వరకు ఇదే పద్ధతి:

ప్రస్తుతం మనం పాము విషాన్ని గుర్రాలు, మ్యూల్స్‌కి ఎక్కించి వాటి నుంచి ప్రతిరోధకాలను సేకరించి, పాము విషానికి విరుగుడుగా వాడుతున్నారు. ఈ పద్ధతిలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ జంతువులు తమ జీవిత కాలంలో వివిధ బ్యాక్టీరియాలకు, వైరస్‌లకు గురవుతుంటాయి, వీటికి కూడా అమి యాంటీబాడీలను కలిగి ఉంటాయి. ఇవి కూడా పాము యాంటీవీనమ్‌లో ఉంటాయి. ఇవి అవసరం లేనివని పరిశోధకులు వెల్లడించారు.

అనేక పరీక్షలు:

అభివృద్ధి చేసిన కొత్త యాంటీబాడీలు ఎలిపిడ్ విషంలోని “3 ఫింగర్ టాక్సిన్(3FTx)” అని పిలువబడే ఒక ప్రధాన టాక్సిన్‌లోని ముఖ్యమైన భాగాన్ని టార్గెట్ చేస్తుంది. కొన్ని పాములు వేర్వేరు 3FTxలను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, ప్రోటీన్‌లోని కొన్ని ప్రాంతాలు ఒకేలా ఉంటాయి. అటువంటి డైసల్ఫైడ్ కోర్ ప్రాంతాలనున యాంటీబాడీలు తటస్థీకరించాయి. పదేపదే పరీక్షలు నిర్వహించిన శాస్త్రవేత్తలు 3FTxలకు సమర్థంగా నిలబడే యాంటీబాడీలను ఎంచుకున్నారు. 3FTxs యొక్క 149 వేరియంట్‌లలో, ఈ యాంటీబాడీ 99కి కట్టుబడి ఉంటుందని విడుదల తెలిపారు.

పరిశోధకులు అత్యంత విషపూరితమైన తైవాన్ బ్యాండెడ్ క్రైట్ పాము టాక్సిక్ 3FTxని ఎలుకలకు ఎక్కించారు. విషం ఇచ్చిన ఎలుకలు నాలుగు గంటల్లోనే మరణించాయి. సింథటిక్ యాంటీబాడీని, విషంతో కలిపి ఇచ్చినప్పుడు మాత్రం ఎలుకలు బతికి, ఆరోగ్యం ఉన్నాయి. ఈ టీం కోబ్రా, బ్లాక్ మాంబా పాముల విషయంలోనూ ఇలాంటి ఫలితాలనే కనుగొంది.

ఈ కొత్త సింథటిక్ యాంటీబాడీ పనితీరు సాంప్రదాయక పాము మందు కంటే 15 రెట్లు సమర్థవంతంగా ఉన్నట్లు తేలింది. సింథటిక్ యాంటీబాడీని 0, 15, 20 నిమిషాల సమయాన్ని పెంచుకుంటూ పోయిన సందర్భంలో కూడా ఎలుకల ప్రాణాల్ని రక్షించింది. ఇక, ఇప్పటి వరకు ఉన్న సాంప్రదాయ యాంటీవీనమ్‌‌ని పాము కాటుకు గురైన వెంటనే ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త యాంటీబాడీని తయారు చేయడానికి పరిశోధకులు మానన-ఉత్పన్నమైన కణ తంతువులను ఉపయోగించారు. దీంతో గుర్రాలకు విషాన్ని ఇంజెక్ట్ చేయాల్సిన పని లేదు. యాంటీబాడీ పూర్తిగా మానవుడిది కాబట్టి, ప్రతికూలతలు ఎక్కువగా ఉండవు. ఈ కొత్త ఆవిష్కరణ వల్ల గుర్రాలకు హాని కలిగించాల్సిన పనిలేదు.