
కూరల్లో వేసే కరివేపాకును తీసేసి తింటారు.. కానీ ఆ కరివేపాకు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే అస్సలు వదలరు..కరివేపాకులను వాటి సువాసన కోసం వంటలలో ఉపయోగించడమే కాకుండా, అనేక అవసరమైన పోషకాలను కూడా కలిగి ఉంటాయి.. కరివేపాకులోని నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే శరీరంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు రోజూ ఉదయం కాఫీ, టీలకు బదులు కరివేపాకు నీళ్లు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..
కరివేపాకులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నందున రోగనిరోధక వ్యవస్థను కూడా బలపరుస్తుంది. మీ రోగనిరోధక శక్తి ఇప్పటికే బలహీనంగా ఉంటే, ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకు నీటిని త్రాగాలి.. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది…కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మేలు చేస్తాయి. ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు కరివేపాకు నీళ్లను తాగితే శరీరంలో జీవక్రియలు పెరిగి కొవ్వులు కరిగిపోయే ప్రక్రియ వేగవంతమై త్వరగా బరువు తగ్గవచ్చు..
రక్తంలో చక్కెరను నియంత్రించే గుణాలు ఉన్నాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే కాఫీ, టీలకు బదులు కరివేపాకు నీటిని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయ పడుతుంది.. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల ఫ్రీ రాడికల్స్ వల్ల చర్మం దెబ్బతినకుండా చేస్తుంది.. కరివేపాకు తినడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది మరియు జుట్టు బలంగా మరియు ఆరోగ్యంగా ఉంటుంది.. అలాగే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.