
వేసవి కాలం ఇంకా మొదలు కాకుండానే ఎండలు మండిపోతున్నాయి.. మధ్యాహ్నం జనాలు బయటకు రావాలంటే భయంతో వణికిపోతున్నారు.. వేసవి దాహన్ని తీర్చుకొనేందుకు జనాలు నీళ్లను, జ్యూస్లను లేదా పండ్లను ఎక్కువగా తీసుకుంటారు. అందులోనూ పుచ్చకాయను ఎక్కువగా తీసుకుంటారు.. పుచ్చకాయను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం..
పుచ్చకాయలో ఎక్కువగా నీరు ఉంటుంది. అంతేకాకుండా ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పుచ్చకాయ మంచిదే కాదా అని చాలామంది సమ్మర్ లో తెగ తినేస్తూ ఉంటారు. కానీ అలా ఎక్కువగా తినడం మంచిది కాదు అంటున్నారు వైద్యులు.. ఎండల వేడి నుంచి కాపాడటంలో ఈ కాయ మొదటి స్థానంలో ఉంటుంది..వీటి విత్తనాలు కూడా చాలా రకాల ప్రయోజనాలను చేకూరుస్తాయి. పుచ్చ గింజలు ఐరన్, పొటాషియం, విటమిన్లతో నిండి ఉంటాయి. పుచ్చపండుతో పాటు గింజలను తినడం వల్ల అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అతిదాహం, చెమట ద్వారా వచ్చే ఖనిజ లవణాల లోపాలను పుచ్చకాయ తగ్గిస్తుంది…
మూత్ర విసర్జనలో మంట ఉన్నవారికి పుచ్చకాయ చక్కని ఔషధంగా పనిచేస్తుంది..చర్మ క్యాన్సర్, ఇన్ఫెక్షన్ వంటి చర్మ రుగ్మతలు తగ్గుముఖం పడతాయి. వేసవి కాలంలో విరివిగా దొరికే వీటిలో బి విటమిన్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఎలక్ట్రోలైట్లు కూడా సమృద్ధిగా అందుతాయి. ఇందులో ఉండే బి విటమిన్లు శరీరానికి శక్తినందిస్తే. పొటాషియం గుండెకుమేలు చేస్తుంది. వడదెబ్బ బారినపడి శరీరం నిస్తేజం కాకుండా కాపాడుతుంది.. ఈ జ్యూస్ లో కాస్త తేనె కలుపుకొని తాగితే గుండెజబ్బులు, మూత్రపిండాల వ్యాధులు తగ్గుతాయి.. బీపి కూడా తగ్గుతుంది.. ఇంకా ఎన్నో సమస్యలను దూరం చేస్తాయి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.