Leading News Portal in Telugu

Health Tips : ఎక్కువగా నిద్ర పోతున్నారా? మీరు డేంజర్లో పడ్డట్లే..



Sleeping (2)

బాగా నిద్రపోతే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.. అది లిమిట్ గానే.. రోజుకు కనీసం ఆరు ఏడు గంటలు నిద్ర అవసరం అని నిపుణులు చెబుతున్నారు.. అంతేకాదండోయ్ అతిగా నిద్రపోయినా ప్రమాదమే అంటున్నారు.. తాజా పరిశోధన ప్రకారం అతిగా నిద్రపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు వైద్యులు. ఆ సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎక్కువగా నిద్ర పోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.. ముఖ్యంగా గుండె సంబందించిన సమస్యలు వస్తాయని చెబుతున్నారు.. అతిగా నిద్రపోవడం వల్ల కాలయం అలాగే పేగులలో కొవ్వు కూడా విపరీతంగా పెరుగుతుందట.. దానివల్ల బరువు కూడా పెరుగుతారట.. అతినిద్ర అంటే శరీరానికి మంచి రెస్ట్ ఇవ్వడం. దానివల్ల మనం తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. కొవ్వు శాతం విపరీతంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఉబకాయం కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది..

ఎక్కువగా నిద్రపోయే వాళ్లు తమ నిద్రను తగ్గించుకొనే ప్రయత్నం చెయ్యడం మంచిది.. రోజులో ఆరు నుంచి ఎనిమిది గంటలు మాత్రమే నిద్రపోవాలి.. నిద్ర వల్ల అనేక ఆలోచనలు, కలలు రావడం వల్ల మనిషి డిప్రెషన్ లోకి వెళ్లే ప్రమాదం కూడా ఉందట. అంతేకాకుండా… తలనొప్పి మరియు వెన్ను నొప్పి కూడా ఉండే ఛాన్స్ ఉందట. బాగా సేపు పడుకోవడం వల్ల వెన్ను నొప్పి కచ్చితంగా వస్తుందని చెబుతున్నారు.. ఇది గుర్తుంచుకొని కేవలం 6- 7 గంటలు మాత్రమే నిద్రపోవడం మంచిది..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.