
చాలా మందికి పొద్దున్నే లేవగానే వేడి వేడిగా టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది.. కాఫీ తాగకపోతే ఏదో కోల్పోయామన్న భావనలో ఉంటారు. అయితే ఖాళీ కడుపుతో కాఫీ తాగితే మాత్రం ప్రమాదకరమని నిపుణులు చెబతున్నారు.. ఎటువంటి దుష్ప్రప్రభావాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉదయం లేవగానే కాఫీ తాగితే కడుపులో యాసిడ్ రిఫ్లక్స్‌ను పెంచుతుంది. అలాగే కార్టిసాల్ స్థాయిలను పెరగడానికి కారణమవుతుంది. ఇది ఒత్తిడిని పెంచుతుంది.. అలాగే శరీరంలోని శక్తి స్థాయిలను పెంచే అవకాశం ఉంది.. ఆందోళన, భయం, ఒత్తిడిని పెంచుతుంది. ఉద్రేకం పెరుగుతుంది. అలాగే రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తుంది. విశ్రాంతిని దెబ్బ తీయడమే కాకుండా ఏకాగ్రతను దెబ్బ తీస్తుంది..
టానిన్లు అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఐరన్, కాల్షియం సహా కొన్ని పోషకాల శోషణకు ఆటంకం కలిగిస్తాయి.. దీనివల్ల శరీరం త్వరగా రోగాల వారిన పడుతుంది. కెఫిన్, యాసిడ్ స్థాయిల కలయిక కడుపుని చికాకుపెడుతుంది. దీంతో కడుపులో నొప్పి, గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్‌కు కారణమవుతుంది.. అలాగే కాఫీని ఖాళీ కడుపుతో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి కెఫిన్ కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.. కాఫీని తాగాలనుకుంటే మాత్రం ఏదైనా తిని తాగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.