Leading News Portal in Telugu

Upasana Konidela : అయోధ్యలో అపోలో హాస్పిటల్ సేవలు ప్రారంభించిన ఉపాసన



Upasana Konidela Ayodhya

డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి అలాగే ఆయన మనవరాలు ఉపాసన కొణిదెల నాయకత్వంలో, అయోధ్యలో ఎమర్జెన్సీ కేర్ సెంటర్‌ను అపోలో హెల్త్‌కేర్ సర్వీసెస్ లో భాగంగా ప్రారంభించారు. సనాతన ధర్మం ద్వారా ప్రేరణ పొంది, రామ్ లల్లాను సందర్శించే యాత్రికులకు తక్షణ, క్లిష్టమైన హెల్త్ కేర్ అందించాలనే లక్ష్యంతో, వైద్యం పట్ల డాక్టర్ రెడ్డి నిబద్ధతకు నిదర్శనంగా ఈ ముందడుగు కనిపిస్తోంది.

Apollo

అపోలో CSR వైస్ ప్రెసిడెంట్ ఉపాసన కొణిదెల సంస్థ ప్రయత్నాలను ముందుకు తీసుకు వెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ద్వారా ఆరోగ్య సంరక్షణ అందించి అయోధ్య ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ‘ది అపోలో స్టోరీ’ హిందీ వెర్షన్‌ను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లాంచ్ చేశారు.
Apollo1

ఈ పుస్తకం ఆరోగ్య సంరక్షణలో ప్రతాప్ సి రెడ్డి స్పూర్తిదాయకమైన ప్రయాణాన్ని వివరిస్తుంది, జీవితాలను మెరుగుపరచడంలో ఆయన కుటుంబం నిబద్ధతను హైలైట్ చేస్తుంది. ఎమర్జెన్సీ కేర్ సెంటర్ సమాజానికి తక్షణ ఆరోగ్య అవసరాలను తీర్చడమే కాకుండా ఆశాజ్యోతిగా కూడా పనిచేస్తుందని అపోలో బృందం విశ్వసిస్తోంది.
Apollo2