Leading News Portal in Telugu

Watermelons: రాత్రి పూట పుచ్చకాయ తింటున్నారా? ఏం అవుతుందో తెలుసా?



Watermelone

వేసవి కాలం వచ్చేసింది.. వేడి రోజు రోజుకు పెరుగుతుంది.. బయట వేడితో పాటు ఒంట్లో వేడి కూడా ఎక్కువగానే ఉంటుంది.. దాహన్ని తీర్చుకోవడం కోసం రకరకాల జ్యూస్ లను, లేదా కొబ్బరి బొండాలను తాగుతుంటారు.. అంతేకాదు వేసవిలో మామిడి పండ్లు, పుచ్చకాయలు విరివిగా లభిస్తాయి.. వీటికి డిమాండ్ కూడా ఎక్కువే.. పుచ్చకాయలకు కాస్త డిమాండ్ ఎక్కువే.. ఈ పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని తింటే వేసవిలో డీహైడ్రేషన్ గురి కాకుండా చేస్తాయి.. అయితే వీటిని రాత్రి పూట తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..

పుచ్చాకాయలలో శరీరానికి కావలసిన అన్ని పోషక విలువలు ఉంటాయి.. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు వ్యాధులను దరిచేరనివ్వవు. గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి… వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి.. వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.. విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి.. అవి శరీరానికి అందుతాయి.. ముఖ్యంగా వేసవిలో శరీరాన్ని హైడ్రెడ్ గా ఉంచుతుంది..

రక్త నాళాలలో కొవ్వులు చేరడాన్ని తగ్గించి, చెడు కొలెస్ట్రాల్ ఏర్పడకుండా ఆపుతుంది..శరీరంలోని టాక్సిన్స్, కొవ్వులను వదిలిస్తుంది. తక్కువ కేలరీలు ఉన్నా వీటిని తింటే సులువుగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.. విటమిన్ ఎ ఎముకల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఎముకల వ్యాధి రిస్క్‌ను, ఎముకల్లో పగుళ్లు సంభవించే ముప్పులను తగ్గిస్తుంది. కిడ్నీల ఆరోగ్యం కూడా బాగుంటుంది.. వేసవిలో రెగ్యులర్గా తీసుకోవడం వల్ల వేసవి తాపం నుంచి బయట పడవచ్చు అని నిపుణులు చెబుతున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.