Leading News Portal in Telugu

Summer Drinks: సమ్మర్లో కూల్గా ఉండాలంటే ఈ పానీయాలు తాగండి..



Summer Drinks

సమ్మర్లో ఎండలో కాసేపు బయటికి వెళ్లి వస్తే.. గొంతు ఎండుకుపోతుంది. చల్లగా ఏదొకటి తాగాలని అనిపిస్తుంది. తాగే ముందు కొన్ని ఆరోగ్యానికి సంబంధించినవి ఎంచుకుంటారు. దీంతో శరీరం లోపల చల్లదనంతో పాటు.. ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఎండాకాలంలో కూల్ గా ఏ డ్రింక్స్ తాగితే మంచిదో తెలుసుకుందాం.

AP CEO MK Meena: రాజకీయ హింసాత్మక ఘటనలపై ఎస్పీల వివరణ కోరా..

నిమ్మ జ్యూస్..
హాట్ సమ్మర్ లో ఎక్కువగా నిమ్మకాయ రసం నీరు తాగాలి. అందులో కొద్దిగా చక్కెర, కొద్దిగా ఉప్పు వేసుకుని షర్బత్ లా తీసుకుంటే.. శరీరం మొత్తం రిలాక్స్ అవుతుంది. అంతేకాకుండా.. ఆరోగ్యానికి కూడా మంచిది.

కొబ్బరి నీళ్లు..
ఎండాకాలంలో కొబ్బరి నీళ్లు శరీరానికి చాలా మంచిది. వేసవి నుంచి ఉపశమనం పొందడానికి రోజుకొక గ్లాసు కొబ్బరి నీటిని తీసుకోవాలి. అందులోని ఎలక్ట్రోలైట్స్ మన బాడీకి చాలా మంచివి.

చెరకు రసం..
చెరకు రసం కూడా ఎండాకాలంలో చాలా మంచిది. చెరకు రసాన్ని నేచురల్‌గా తయారైంది తాగితే మేలు. దీనిని తీసుకోవడం వల్ల అప్పటికప్పుడు శక్తి లభిస్తుంది. వేడికారణంగా అలసిన శరీరానికి దీని వల్ల ఉపశమనం లభిస్తుంది. కాబట్టి, చెరకు రసం బెస్ట్ సమ్మర్ డ్రింక్ అని చెప్పొచ్చు.

పుచ్చకాయ..
సమ్మర్ అనగానే ముందుగా గుర్తొచ్చే పండ్లలో పుచ్చకాయ ఒకటి. దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పుచ్చకాయ జ్యూస్ చేసుకుని తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య తగ్గుతుంది. అందుకే.. సమ్మర్ లో పుచ్చకాయ జ్యూస్ చాలా మంచిది.

పచ్చి మామిడి రసం..
పచ్చిమామిడిని కూడా రసంలా చేసి తాగొచ్చు. ఈ రసం వేసవి తాపాన్ని తగ్గించి శరీరానికి శక్తినిస్తుంది. దీని వల్ల హైడ్రేట్‌గా కూడా ఉంటారు.

లస్సీ..
పెరుగుతో చేసిన లస్సీ ఎండకాలంలో ది బెస్ట్ అని చెప్పవచ్చు. ఇది మంచి రీఫ్రెషింగ్ డ్రింక్. దీనిని తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. ఎంత వేడిగా ఉన్నా కాస్తా లస్సీ తాగితే చాలా రిలాక్స్‌గా ఉంటుంది.

కోల్డ్ కాఫీ..
కాఫీ కూడా చాలా మందికి ఇష్టమే. ప్రతిసారి హాట్ కాఫీ తాగే బదులు.. ఇప్పుడు సీజన్‌కి తగట్టుగా కోల్డ్ కాఫీ తాగండి. చాలా టేస్టీగా ఉంటుంది. రిలాక్స్‌డ్‌గా ఫీల్ అవుతారు.