Leading News Portal in Telugu

Jackfruit Benefits : పనసపండుతో పుట్టెడు ఆరోగ్యం..



Jack Fruit

పనస పండు కొయ్యడం కష్టం కానీ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.. కష్టమైన కోసుకొని తింటారు.. ఈ పండు వాసన చూస్తే చాలు తినాలని అనిపిస్తుంది.. ఈ పండు రుచికరమైనది మాత్రమే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే.. ఈ పండులో విటమిన్ ఎ, సి, బి6తో పాటు ధియామిన్, రిబోప్లానిన్, నియాసిన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం మరియు ఫైబర్ లు అధికంగా ఉంటాయి.. వీటిని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి చూసేద్దాం..

రక్తపోటును నియాంట్రించడం లో సహాయ పడుతుంది.. అలాగే కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. ఫైబర్, యాంటి ఆక్సిడెంట్స్ అధికంగా ఉండటంతో బరువు తగ్గడంలో సహాయ పడుతుంది.. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.. వైరస్ ల వల్ల వచ్చే వ్యాధుల నుంచి కాపాడుతుంది.. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది..

విటమిన్ ఎ, సి లు పుష్కలంగా ఉన్న ఈ పండును తినడం వల్ల కంటి సమస్యలు దూరం అవ్వడంతో పాటుగా, చర్మ సమస్యలు దూరం అవుతాయి.. అలాగే ఎముకలకు అవసరమైన మెగ్నీషియం, కాల్షియం ఉన్నాయి.. గుండె పనితీరును మెరుగు పరచి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.. అందుకే ఏడాదిలో ఒక్కసారైనా వీటిని తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.