Leading News Portal in Telugu

Health Tips : కొబ్బరి నీళ్లు, తులసి ఆకులను కలిపి తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?



Glass,of,coconut,juice,with,blurred,coconut,tree,background.

సమ్మర్ వచ్చేసింది.. రోజు రోజుకు వేడి బాగా పెరిగిపోతుంది.. జనాలు బయటకు రావాలంటే భయంతో వణికి పోతున్నారు.. ఇక దాహన్ని తీర్చుకోవడానికి చెరుకు రసం కూల్ డ్రింక్స్, జ్యుస్ లను ఎక్కువగా తాగుతుంటారు.. అయితే వాటిని తాగడం వల్ల అప్పటికి ఉపశమనం కలిగినా కూడా ఆ తర్వాత మాత్రం ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.. అందుకే కొబ్బరి నీళ్లల్లో తులసి ఆకులను వేసుకొని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

మాములుగా కొబ్బరి నీళ్లను తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. శరీరానికి కావాల్సిన విటమిన్స్ అన్ని పుష్కలంగా అందుతాయి.. ఇక తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది.. ఒక గ్లాస్ కొబ్బరి నీటిలో తాజా తులసి ఆకులు లేదా తులసి రసం వేసి బాగా కలిపి రోజులో ఏ సమయంలోనైనా తాగవచ్చు.. వీటిని తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇలా తాగడం వల్ల ఒత్తిడి,ఆందోళన వంటివి తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుంది. మనలో చాలా మంది మారిన పరిస్థితులకు తీవ్రమైన ఒత్తిడి,డిప్రెషన్ కి గురి అవుతున్నారు.. దాన్ని నుంచి బయట పడాలంటే మాత్రం ఈ నీటిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కిడ్నీలో రాళ్ళ సమస్యతో బాధపడేవారు రోజూ తాగితే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు అని నిపుణులు చెబుతున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.