Leading News Portal in Telugu

Beauty Tips : మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా? ఈ టిప్స్ మీ కోసమే..



Pimples (2)

ఈరోజుల్లో యూత్ ఎక్కువగా ఇబ్బంది పడే సమస్య మొటిమలు.. మారిన వాతావరణం, ఆహారపు అలవాట్లు కారణంగా ఎక్కువ మందికి చర్మ సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి.. ప్రతి ముగ్గురిలో ఒకరికి చర్మ సమస్యలు ఉన్నాయి. అందులో మొటిమలు, తామర, రోసేసియా వంటి సమస్యలున్నాయి.. దురద, చికాకుతో పాటుగా మొటిమలు కూడా భాదిస్తుంటాయి.. ఈ సమస్య నుంచి బయట పడాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..

ఆరోగ్యకరమైన చర్మంను హైడ్రేటెడ్‌గా ఉంచాలి.. పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం పుష్కలంగా నీరు తాగడం, పండ్లు, కూరగాయలు, ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్‌తో కూడిన పోషకాహారం తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్‌ని తీసుకోవడం వల్ల చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు..

ఒత్తిడిని తగ్గించుకోవాలి.. ధ్యానం, డీప్ బ్రీథ్ వర్కౌట్స్ హెల్ప్ చేస్తాయి… అలాగే మంచి నిద్ర కూడా చాలా అవసరం.. అప్పుడే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది..

జిడ్డు చర్మంలో బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటాయి. హైపర్ పిగ్మంటేషన్, ముడతలు కూడా వస్తాయి. దీని వల్ల వయసులో పెద్దవారిలా కనిపిస్తారు.. అందుకే చల్లని నీటితో ముఖాన్ని బాగా కడుగుతూ ఉండాలి.. గాఢత తక్కువ ఉన్న క్రీములను వాడాలి.. అలాగే జంక్ ఫుడ్స్ ను తక్కువగా తీసుకోవడం మంచిది..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.