Leading News Portal in Telugu

Viral Video: అబ్బా ఏం ఐడియా బాసు.. ఇలా చేస్తే నెలల తరబడి కరివేపాకు ఫ్రెష్ గా..


  • కరివేపాకుని ఎలా నెలలపాటు ఫ్రెష్ గా ఉండేలా నిల్వ చేయాలి
  • ఐస్ క్యూబ్ ట్రేలో కరివేపాకు ఉంచి నీళ్ళు పోయాలి.
  • ఐస్ క్యూబ్స్ ను జిప్ లాక్ కవర్ లో ఉంచుకోవాలి.
Viral Video: అబ్బా ఏం ఐడియా బాసు.. ఇలా చేస్తే నెలల తరబడి కరివేపాకు ఫ్రెష్ గా..

curry leaves : శాఖాహారులైన సరే.. మాంసాహారులైన సరే.. ప్రతి కూరలలో కొత్తిమీర లాగానే కరివేపాకు ( curry leaves )ను కూడా ఉపయోగిస్తారు. ఏ వంటకాలలోనైనా సరే కరివేపాకు కచ్చితంగా పడాల్సిందే. వంటలలో కరివేపాకు పడకపోతే వంట రుచిగా అనిపించదు కూడా. అయితే వంటకాలలో ఒకటి లేదా రెండు కరివేపాకు రెమ్మలను తీసుకొని వాటి ఆకులను వేస్తే చాలు ఆ వంటకం రుచి గుమగుమలాడుతుంది. అంతేకాదు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా లేకపోలేదు. అయితే కరివేపాకును ఎక్కువ మొత్తంలో తీసుకోని దాన్ని నిల్వ చేయడానికి చాలా పద్ధతులను ఉపయోగిస్తారు.


Odisha: శాసనసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులు..

ఇకపోతే తాజాగా ఓ వీడియో కరివేపాకుని ఎలా నెలలపాటు ఫ్రెష్ గా ఉండేలా నిల్వ చేయాలో సంబంధించి వీడియో వైరల్ ( Viral Video) అవుతుంది. వీడియోలో చెప్పిన విధంగా చేస్తే సుమారు ఆరు నెలల పాటు కరివేపాకును ఫ్రెష్ గా నిల్వ చేసుకోవచ్చట. ఇక వైరల్ గా మారిన వీడియోలో ఉన్న దాన్ని బట్టి చూస్తే ముందుగా మనం తీసుకోవచ్చున ఫ్రెష్ కరేపాకులను పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఓ ఐస్ క్యూబ్ ట్రేను తీసుకువచ్చి అందులో కరివేపాకు ఆకులను పేర్చుకోవాలి. ఆ తర్వాత ఐస్ ట్రేలో నీళ్లను పోసి దానిని ఫ్రిజ్ లో ఉంచాలి. అలా డీ ఫ్రిడ్జ్ లో కొద్దిసేపు ఉంచిన తర్వాత దానిని బయటకు తీస్తే కరివేపాకు ఐస్ క్యూబ్ మధ్యలో ఉండిపోతుంది.

Pakistan cricketer Haris Rauf: అభిమానిపై గొడ‌వ‌కు కాలు దువ్విన పాకిస్తాన్ క్రికెట‌ర్‌.. (వీడియో)

ఇక ఆ ఐస్ క్యూబ్స్ ను తీసుకొని ఓ జిప్ లాక్ కవర్ లో వాటిని దాంట్లో వేసి ఫ్రిజ్ లో ఉంచుకుంటే చాలు. దానిని మళ్లీ మనకు కావలసినప్పుడు తిరిగి మామూలు నీటిలో వేస్తే తాజా కరివేపాకు సిద్ధమైపోతుంది. దీంతో మళ్ళీ మనము వంటల్లో సులువుగా ఫ్రెష్ కరివేపాకును ఉపయోగించుకోవచ్చు. ఇక ఈ సింపుల్ చిట్కాను చూసిన ప్రజలు అయ్యో.. ఇన్ని రోజులు మాకు ఇలాంటి ఆలోచన ఎందుకు రాలేదంటూ తెగ బాధ పడిపోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియోను ఒకసారి వీక్షించండి.