Leading News Portal in Telugu

Health Tips : ఆ రెండింటిని కలిపి తీసుకుంటే ఆ సమస్యలు దూరం..


Health Tips : ఆ రెండింటిని కలిపి తీసుకుంటే ఆ సమస్యలు దూరం..

ఈరోజుల్లో ఆహారపు అలవాట్లు, అలాగే వాతావరణంలో మార్పుల వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి.. అందుకే మన వంట గదిలో ఉండే కొన్నిటితో కొన్ని సమస్యలకు చెక్ పెట్టొచ్చు అని నిపుణులు చెబుతున్నారు. అందులో ఒకటి సోంపు.. ఈ సోంపు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనం చూసే ఉంటాము.. కానీ పటికను కలిపి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి చాలా మందికి తెలియదు.. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


మాములుగా సోంపులో కాల్షియం, సోడియం, ఐరన్ మరియు పొటాషియం,జింక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సమృద్దిగా ఉంటాయి… అలాగే పటికలో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి.. అందులో ఐరన్,కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్ వంటివి సమృద్దిగా ఉంటాయి. చాలా మంది భోజనం అయ్యాక సోంపు,పటికబెల్లం కలిపి తీసుకుంటారు.. వీటి వల్ల ఉదర సమస్యలు పూర్తిగా దూరం అవుతాయి..

గ్యాస్, ఏసిడిటి వంటి సమస్యల నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది.. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు.. కంటి సమస్యలను దూరం చెయ్యడంలో ఈ రెండు బేషుగ్గా పనిచేస్తాయి.. అలసట,ఒత్తిడిగా ఉన్నప్పుడు సోంపు,పటికబెల్లం కలిపి తింటే ఒత్తిడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది. శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.. సీజనల్ వ్యాధులను దూరం చేస్తుంది.. అలాగే నోటి సమస్యలను కూడా దూరం చెయ్యడంలో సహాయ పడుతుంది.. అంతేకాదు ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి..