Leading News Portal in Telugu

Motion Sickness: చాలామందికి ప్రయాణాలలో వాంతులవుతుంటాయి.. ఎందుకో తెలుసా.?


  • మనలో చాలామంది ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టం.
  • కానీ అందులో చాలామంది ప్రయాణం చేయడానికి ధైర్యం చేయలేరు.
  • అయితే దానికి కారణం.. వాంతులు.
Motion Sickness: చాలామందికి ప్రయాణాలలో వాంతులవుతుంటాయి.. ఎందుకో తెలుసా.?

Motion Sickness: మనలో చాలామంది ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టం.. అయినా కానీ అందులో చాలామంది ప్రయాణం చేయడానికి ధైర్యం చేయలేరు. ముఖ్యంగా బస్సులో, కారులో ప్రయాణమే అంటే ఇంకా భయపడతారు. ఇలా ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ సమస్య ఉంటుంది. అయితే దానికి కారణం.. వాంతులు. అవును., ప్రయాణం చేస్తుండగా కళ్లు తిరగడం లేదా వాంతులు కావడం చాలా మందిని తెగ ఇబ్బంది పెట్టే సమస్య . ఇందులో కొందరికి ప్రయాణం మొదలు అవ్వగానే.. ఈ సమస్య మొదలవుతుంది. ఇంకాకొద్ది మందిలో ఎక్కువ సేపు ప్రయాణం తర్వాత, ఎక్కువుగా ఎగుడుదిగుడు రోడ్ల వల్ల, ఇంకా ఘాట్ రోడ్డు ప్రయాణాలు, వాహనంలోని వాసన పడకపోవడం లేన్తి వల్ల వాంతులు వస్తాయి. ఈ సమస్య ఆ ప్రయాణం చేసిన కూడా ఉంటుంది. కొంతమందికైతే.. బైక్‌ ఎక్కినా ఈ వాంతులు అవుతుంటాయి. అయితే ఇలాంటి సమస్య ఉన్నవారు.. ప్రయాణం చేసేప్పుడు కొన్ని టిప్స్ ఫాలో చేస్తే.. వారి జర్నీ హ్యాపీగా జరుగుతుంది.

National Disaster: జాతీయ విపత్తు అంటే ఏంటి?.. వయనాడు ఘటనపై కేంద్ర వైఖరి?

చాలామందికి కారులో ప్రయాణం చేస్తున్న సమయంలో ముందు సీటులో కూర్చున్న కన్నా వెనక కూర్చున్న వారికే వాంతయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక బస్సులోనూ వీలైనంతవరకు ముందు వరుసలో కూర్చోవటం చాలా మంచిది. ఇంకా రైలులో అయితే రైలు కదిలే దిశవైపు ముఖం పెట్టి కూర్చోవాలి. అలాగే కిటికీ పక్కన కూర్చోవడం తప్పనిసరి. ఎందుకంటే., ప్రయాణించే సమయంలో తగినంత గాలి తగిలేలా చూసుకోవాలి. ఇలాంటి సమయాల్లో మీకు వికారంగా ఉంటే.. అల్లంతో చేసిన ఏదైనా పదార్థాన్ని తినండి. దాని వల్ల మీకు కొంత ఉపశమనం లభిస్తుంది. అల్లం టీ తాగినా కూడా మీకు వికారం సమస్య తగ్గిస్తుంది.

Suriyas Kanguva : స్టార్ హీరో సూర్య కంగువా.. ట్రైలర్ బ్లాస్ట్ అయ్యేది ఎప్పుడో తెలుసా ?

ఇంకా యాలకులు ఈ సమస్యకు చక్కగా పనిచేస్తాయి. ఓ రెండు యాలకులు తింటే వికారం తగ్గుతుంది. మీ నోటి రూచి మారినా కూడా ఇందులోనుండి ఉపశమనం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల వాంతి వచ్చే భావన తగ్గుతుంది. అలాగే తులసి ఆకులు నమిలినా.. వాంతి భావన తగ్గే అవకాశముంది. మరికొందరికి నిమ్మకాయ వాసనా చూస్తే ఈ సమస్యకు పరిస్కారం లభిస్తుంది.