Leading News Portal in Telugu

first aid in burn accident and firecrackers precautions during Diwali


  • దీపావళి పండుగ రోజున పటాకులు.. దీపాలతో ప్రమాదం జరిగే అవకాశం
  • కొంచెం అజాగ్రత్తగా ఉన్నా అగ్ని ప్రమాదాలు
  • ఆస్పత్రికి వెళ్లేందుకు లేట్ కావడంతో తీవ్ర ఆవేదన
  • కాలిన గాయాలకు హోమ్ రెమిడీస్
Burn Accident: టపాసుల వల్ల కాలిన గాయాలైతే.. ఈ వంటింటి చిట్కాలు పాటించండి

దీపావళి పండుగ సమయంలో పటాకులు, దీపాల వినియోగిస్తుంటాం. ఈ సమయంలో కొంచెం అజాగ్రత్తగా ఉన్నా మంటలు లేదా అగ్ని ప్రమాదాలు సంభవించవచ్చు. కాబట్టి, ఈ సందర్భంగా జాగ్రత్తల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. అంతే కాదు.. ప్రమాద తీవ్రతను తగ్గించడానికి కాలిన గాయాలకు ప్రథమ చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉండటం కూడా అవసరం. చిన్నపిల్లలకు ప్రమాదం జరిగితే.. ఆస్పత్రికి వెళ్లేలోపు తీవ్ర నొప్పి, ఆవేదనకు లోనవుతారు. అందుకే కాలిన గాయాలు అయితే ఈ వంటింటి చిట్కాలు పాటించండి…

బంగాళదుంప..
కాలిన గాయాల నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని ఇంటి చిట్కాలు ట్రై చేయొచ్చు. తక్షణ ఉపశమనం కోసం పచ్చి బంగాళదుంప ముక్కను కాలిన గాయాలపై సున్నితంగా రుద్దండి. పచ్చి బంగాళాదుంపలు గాయం చుట్టూ చికాకును నివారించడంలో సహాయపడుతుంది.

కలబంద గుజ్జు..
కాలిన ప్రదేశంలో బొబ్బలు ఏర్పడే అవకాశాన్ని తగ్గించడానికి కలబంద జెల్‌ను అప్లై చేయవచ్చు. గాయపడిన ప్రాంతాన్ని బాగా కడిగి దానిపై తాజా కలబంద రసం లేదా జెల్ రాస్తే ఉపశమనం కలుగుతుంది. కాలిన ప్రదేశంలో బొబ్బలు ఏర్పడే అవకాశాన్ని తగ్గించడానికి కలబంద జెల్‌ను అప్లై చేయవచ్చు. గాయపడిన ప్రాంతాన్ని బాగా కడిగి దానిపై తాజా కలబంద రసం లేదా జెల్ రాస్తే ఉపశమనం కలుగుతుంది.

కొబ్బరినూనెను..
కొబ్బరినూనెను అన్ని రకాల గాయాలకు రాస్తే త్వరగా మానుతుంది. కొబ్బరి నూనెలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది చర్మంపై మంటలను తగ్గిస్తుంది. చిన్నపాటి నుంచి పెద్ద కాలిన గాయాల వరకు ఏ ప్రదేశంలోనైనా తేనెను రాసుకోవచ్చు. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటుంది.

లావెండర్ ఆయిల్‌..
లావెండర్ ఆయిల్‌లో.. లినాలిల్ అసిటేట్, బీటా-కార్యోఫిలీన్ అనాల్జేసిక్. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది కాలిన గాయాలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. గాయాన్ని వేగంగా నయం చేస్తుంది. కాలిన గాయాలకు అత్యంత ప్రభావవంతమైన హోం రెమెడీలలో ఒకటి చల్లని పాలను కాలిన ప్రదేశంలో 10 నుంచి 15 నిమిషాల పాటు రాయడం. ఇది తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది.

టీ ట్రీ ఆయిల్‌..
టీ ట్రీ ఆయిల్‌లో యాంటిసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, పెయిన్ రిలీవింగ్ గుణాలు ఉన్నాయి. ఇది చిన్నపాటి కాలిన గాయాలను నియంత్రిస్తుంది. పసుపులో, గోరువెచ్చని పాలు కలిపి, ఈ మిశ్రమాన్ని రాత్రి పూట కాలిన చోట రాస్తే నొప్పి తగ్గుతుంది. పసుపులో కర్కుమినాయిడ్స్, యాంటీ క్యాన్సర్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది మంటను తగ్గిస్తుంది.