Leading News Portal in Telugu

Drinking these drinks will affect the liver.


  • పార్టీ, ఫంక్షన్ ఇలా వేడుక ఏదైనా కూల్ డ్రింక్స్ తాగుతారు
  • చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికే ఇష్టమే
  • డ్రింక్స్ తాగే అలవాటైతే కాలేయం దెబ్బ తినే అవకాశం
  • కాలేయ వ్యాధులను కలిగించే కొన్ని పానీయాలు ఉన్నాయి.
Health: ఈ డ్రింక్స్ తాగుతున్నారా..? కాలేయానికి ఎఫెక్ట్

పార్టీ, ఫంక్షన్ ఇలా వేడుక ఏదైనా కూల్ డ్రింక్స్ తాగేస్తుంటారు. ఇలా ఇష్టమైన డ్రింక్స్ తాగుతుంటే.. ఆ మజానే వేరుంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ వీటిని ఎంతో ఇష్టంగా తాగుతారు. అయితే.. అలాగే అలవాటైతే మీ శరీరంలో ఉన్న కాలేయం దెబ్బ తినే అవకాశం ఉంది. అవును, మీరు విన్నది నిజమే.. మీ కాలేయానికి చాలా హాని కలిగించే, కాలక్రమేణా కాలేయ వ్యాధులను కలిగించే కొన్ని పానీయాలు ఉన్నాయి. కాలేయం మన శరీరంలోని ఒక ముఖ్యమైన అవయవం. ఇది వ్యర్థాలను ఫిల్టర్ చేయడానికి, కొవ్వులను జీవక్రియ చేయడానికి, జీర్ణక్రియకు మద్దతుగా నిరంతరం పనిచేస్తుంది. మనం తాగే కొన్ని డ్రింక్స్‌లలో కాలేయంపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇంతకీ ఆ డ్రింక్స్ ఏంటీ.. వీటి వల్ల ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందో తెలుసుకుందాం…..

1. సోడా:
సోడా కేవలం స్వీట్ డ్రింక్ మాత్రమే కాదు. దీనిలో ఉండే అదనపు చక్కెర, ఆర్టిఫిషియల్ రసాయనాలు కాలేయంపై ప్రభావం చూపుతాయి. కెనడియన్ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అండ్ హెపటాలజీలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. కూల్ డ్రింక్స్ క్రమం తప్పకుండా తాగడం వల్ల కాలేయంలో కొవ్వు చేరే ప్రమాదాన్ని పెంచుతుంది. దీనినే నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) అంటారు. కాలేయంలో కొవ్వు పేరుకుపోయి.. వాపు, అనేక తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది.

2. ఎనర్జీ డ్రింక్స్:
చాలా మంది ఎనర్జీ కోసం ఎనర్జీ డ్రింక్స్ తాగుతుంటారు. అయితే ఇవి మీ లివర్‌కు చాలా హాని కలిగిస్తాయి. US నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం ప్రకారం.. ఎక్కువ ఎనర్జీ డ్రింక్ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. ఈ డ్రింక్స్‌లలో అధిక మొత్తంలో ఉండే టౌరిన్, కెఫిన్, ఇతర ఉత్ప్రేరకాలు కాలేయంపై ఒత్తిడిని కలిగిస్తాయి. దీంతో.. దీర్ఘకాలంలో కాలేయం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాగే.. కొన్ని సందర్భాల్లో కాలేయ మార్పిడికి దారితీస్తుంది.

3. ఆల్కహాల్:
ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల కాలేయానికి హాని కలుగుతుందని దాదాపు అందరికీ తెలుసు. జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ ప్రకారం.. ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వస్తుంది. ఇది మంట, మచ్చలు, చివరికి కాలేయ వైఫల్యానికి దారితీస్తుంది.

4. షుగర్-లోడెడ్ డ్రింక్స్:
ఫ్లేవర్డ్ టీ, ఫ్రూట్ పంచ, ఇతర చక్కెరతో కూడిన డ్రింక్స్‌లలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. ఇది కాలేయంపై మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ చక్కెర కాలేయంలో కొవ్వుగా తయారవుతుంది. ఇది NAFLD ప్రమాదాన్ని పెంచుతుంది. కాలక్రమేణా కాలేయంలో మంట, ఫైబ్రోసిస్ లేదా సిర్రోసిస్ వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి. ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ డ్రింక్స్‌ను దూరంగా పెట్టాలి.