- బరువు తగ్గాలంటే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి
- ఎక్కువగా అల్పాహారం తినడం, కడుపు నిండా భోజనం చేయడం మంచిది కాదు
- కడుపు కొంచెం ఖాళీగా ఉండే విధంగా రాత్రి భోజనం చేయాలి
- బరువు విషయంలో రాత్రి భోజనంలో తక్కువగా తినండి
- 7 గంటలకే రాత్రి భోజనం చేయాలి.
బరువు తగ్గాలంటే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. ఎక్కువగా అల్పాహారం తినడం, కడుపు నిండా భోజనం చేయడం మంచిది కాదు. కడుపు కొంచెం ఖాళీగా ఉండే విధంగా రాత్రి భోజనం చేయాలి. తరచుగా ప్రజలు పగటిపూట కొద్దిగా భోజనం చేసి.. రాత్రి ఎక్కువగా తింటారు. రోజు ఇలా తినడం వల్ల మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.. ఊబకాయాన్ని పెంచుతుంది. బరువు విషయంలో రాత్రి భోజనంలో తక్కువగా తినండి. 7 గంటలకే రాత్రి భోజనం చేయాలి. అలాగే.. పొట్ట భారంగా మారని ఆహార పదార్థాలను డిన్నర్‌లో చేర్చుకోవాలి. రాత్రి భోజనం తేలికగా, పోషకమైనదిగా, సమతుల్యంగా ఉండాలి. పెన్సిల్వేనియా యూనివర్శిటీ పరిశోధన ప్రకారం.. రాత్రి భోజనంలో ఎక్కువగా ఆహారం తీసుకోవడం జీవక్రియను ప్రభావితం చేస్తుంది.. బరువు పెరుగుతుంది. రాత్రి భోజనంలో కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి సమస్యలను పెంచుతుంది. జీర్ణక్రియను మరింత దిగజార్చుతుంది. మీ బరువు అదుపులో ఉండాలంటే.. మీ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రి భోజనంలో ఈ ఆహారాలను తినక పోవడం మంచిది.
పచ్చి ఆకు కూరలు ఆరోగ్యకరమే కానీ రాత్రి భోజనంలో తినకూడదు:
గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ మీరు వాటిని డిన్నర్‌లో తినకూడదు. ఆకుకూరలు తీసుకోవడం వల్ల పగటిపూట శరీరంలో హీరోలా పనిచేసి రాత్రిపూట జీరోలా పనిచేస్తుంది. రాత్రి భోజనంలో బచ్చలికూర, బతువా (పప్పుకూర) వంటివి తీసుకోవడం వల్ల జీవక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. ఇది జీర్ణక్రియను దెబ్బతీస్తుంది.. బరువు పెరుగుతుంది. ఆయుర్వేదం ప్రకారం.. రాత్రిపూట దీనిని తీసుకోవడం వల్ల వాత దోషం పెరుగుతుంది. ఇది కండరాలలో వాపు, దృఢత్వాన్ని పెంచుతుంది. నరాల బలహీనతకు దారితీస్తుంది. రాత్రి భోజనంలో ఈ ఆకు కూరను తీసుకోవడం మానుకోండి.
రాత్రిపూట పండ్లు తినడం మానుకోండి:
రాత్రి భోజనంలో పండ్లు తీసుకోవడం మానుకోండి. అమెరికన్ జనరల్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన ఒక పరిశోధన ప్రకారం.. పండ్లలో ఫ్రక్టోజ్, ఫైబర్ ఉంటాయి. వీటిని తినేటప్పుడు జీవక్రియ మందగిస్తుంది. ఇవి కేలరీలను బర్న్ చేసే శరీర సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.. ఊబకాయాన్ని పెంచుతుంది. రాత్రి భోజనంలో పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది. ఆయుర్వేదం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత పండ్లు అస్సలు తినకూడదు.
ఎక్కువగా భోజనం చేయొద్దు:
2011లో ది ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబేసిటీలో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం.. రాత్రి భోజనంలో భారీ ఆహారాన్ని తీసుకోవడం వల్ల జీవక్రియ మందగిస్తుంది. ఇది బరువు పెరిగే అవకాశాలను పెంచుతుంది. ఈ ఆహారాలు తినడం వల్ల జీర్ణక్రియ సరిగా జరగదు. రాత్రి భోజనంలో షాహీ పనీర్, చికెన్ బిర్యానీ, మటన్ తీసుకుంటే ఊబకాయం పెరిగి జీర్ణశక్తి పాడు అవుతుంది. ఆయుర్వేదం ప్రకారం.. భారీ ఆహారాన్ని తీసుకోవడం వల్ల కఫ దోషం పెరుగుతుంది. ఇది మీ నిద్రను ప్రభావితం చేస్తుంది.
రాత్రి భోజనంలో కెఫిన్‌తో కూడిన పానీయాలకు దూరంగా ఉండండి:
మీరు మీ స్థూలకాయాన్ని తగ్గించుకోవాలనుకుంటే రాత్రిపూట కెఫిన్ అధికంగా ఉండే పానీయాలు తాగకూడదు. రాత్రి భోజనం తర్వాత కాఫీ, టీ తీసుకోవడం వల్ల మీ జీర్ణశక్తిని చెడగొట్టవచ్చు. అలాగే.. మీ నిద్రకు భంగం కలిగిస్తుంది. రాత్రి భోజనంలో కెఫిన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మానుకోండి.