- కొలెస్ట్రాల్ మన శరీరానికి చాలా అవసరం
- కానీ అధికంగా ఉంటే చాలా హానికరం
- కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే ధమనులు మూసుకుపోతాయి
- గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం
- ఈ సమస్యల నుంచి దూరంగా ఉండేందుకు ఆహారం ద్వారా కంట్రోల్ చేయవచ్చు.
కొలెస్ట్రాల్ మన శరీరానికి చాలా అవసరం. కానీ అధికంగా ఉంటే చాలా హానికరం. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే ధమనులు మూసుకుపోతాయి. ఈ క్రమంలో గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అయితే ఈ సమస్యల నుంచి దూరంగా ఉండేందుకు ఆహారం ద్వారా కంట్రోల్ చేయవచ్చు. ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చు. మంచి ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా.. మీ వంటగదిలో ఉండే కొన్ని కూరగాయలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇంతకీ కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఆ కూరగాయలేంటో తెలుసుకుందాం….
క్యారెట్:
క్యారెట్‌లో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు, కరిగే ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్ శోషణను తగ్గించడం ద్వారా అధిక కొలెస్ట్రాల్ సమస్య నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. అంతే కాకుండా.. విటమిన్ ఎ సమృద్ధిగా ఉన్న క్యారెట్ కంటి చూపు, చర్మానికి కూడా మేలు చేస్తుంది. దీన్ని సలాడ్ లేదా ఇతర వంటలలో వండుకుని మీ ఆహారంగా తినవచ్చు.
పొట్లకాయ:
పొట్లకాయలో నీరు, పీచు పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా.. కడుపుని శుభ్రపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచుతుంది. పొట్లకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడమే కాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ఇది శరీరం నుండి విషాన్ని తొలగించడంలో కూడా సహాయపడుతుంది.
టొమాటో:
టొమాటోల్లో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్), ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషించే యాంటీఆక్సిడెంట్. అంతే కాకుండా.. టొమాటోలో ఉండే ఫైబర్ శరీరంలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గిస్తుంది. టొమాటో లేదా దాని రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
బచ్చలికూర:
బచ్చలికూర పచ్చి ఆకు కూరలలో పోషకాల నిధి. ఇందులో ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బచ్చలికూరలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదం నుండి కూడా రక్షిస్తుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా బచ్చలికూరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది.. తద్వారా అనేక వ్యాధులను నివారిస్తుంది.
బ్రోకలీ:
బ్రోకలీ రుచికే కాకుండా.. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే సల్ఫోరాఫేన్ అనే మూలకం మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్)ను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బ్రోకలీలో సమృద్ధిగా ఉండే ఫైబర్ శరీరం నుండి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. అంతే కాకుండా.. దీనిలో విటమిన్ సి, విటమిన్ కె వంటి పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల బ్రోకోలీ మన రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.. అనేక వ్యాధులను నివారిస్తుంది.