- చలికాలంలో దీర్ఘకాల నొప్పి, ఎముకల సమస్యలు
- శీతాకాలంలో విటమిన్ డి లోపం సర్వసాధారణం
- విటమిన్ డి.. ఎముకలను బలంగా చేయడానికి,
- రోగనిరోధక శక్తిని పెంచడానికి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అవసరం.
దీర్ఘకాల నొప్పి, ఎముకల సమస్యలు చలికాలంలో ఎక్కువగా వస్తుంటాయి. చలి కాలంలో ఎండలో తక్కువగా గడుపుతాం. ఈ క్రమంలో.. శీతాకాలంలో విటమిన్ డి లోపం సర్వసాధారణం అవుతుంది. శరీరంలో విటమిన్ డి సరఫరా చేయడానికి సూర్యకాంతి చాలా అవసరం. విటమిన్ డి.. ఎముకలను బలంగా చేయడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అవసరమవుతుంది. అయితే.. శీతాకాలంలో విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి కొన్ని ఆహారాలు తింటే మంచిది. దాని వల్ల ఆరోగ్యం ఉంటాం..
విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు, ప్రయోజనాలు:
చేప:
మాంసాహారం తినే వారు చేపలను తింటే చాలా మంచింది. చేపల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. సాల్మన్, ట్యూనా, మాకేరెల్‌లో అధిక మొత్తంలో విటమిన్ డి ఉంటుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
గుడ్డు పచ్చసొన:
గుడ్డు పచ్చసొనలో విటమిన్ డి ఉంటుంది. ఇది జుట్టు, చర్మం, గోళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. చలికాలంలో గుడ్లు ఎక్కువగా తినడం ఆరోగ్యానికి కూడా మంచిది.
పాలు, పాల ఉత్పత్తులు:
విటమిన్ డితో కూడిన పాలు, పెరుగు, చీజ్ తీసుకోవడం వల్ల విటమిన్ డి శరీరానికి అందుతుంది. ఇవి కాల్షియాన్ని పెంచడంలో సహాయపడుతుంది. దాని వల్ల ఎముకలను బలంగా చేస్తుంది.
పుట్టగొడుగులు:
పుట్టగొడుగులు.. ఇవి సూర్యకాంతితో పెరుగుతాయి. పుట్టగొడుగులు విటమిన్ డి యొక్క సహజ మూలం. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
తృణధాన్యాలు:
అల్పాహారం తృణధాన్యాలు, ఓట్స్‌లో విటమిన్ డి ఉంటుంది. పిల్లలు, పెద్దలకు ఇది మంచి పోషకాహార ఎంపిక.