- సమస్యల కారణంగా లైంగిక జీవితంలో ఇబ్బందులు
- జంటల మధ్య సంతృప్తి చెందని శృంగారం వల్ల
- మంచి మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉండటం..
Relationship Tips: పరస్పర అవగాహనతో పాటు మంచి లైంగిక జీవితం కూడా సంతోషకరమైన వైవాహిక జీవితానికి కారణం. లైంగిక జీవితం బోరింగ్‌గా మారినప్పుడు, జంటల సంబంధం బలహీనంగా మారుతుంది. ఒక్కోసారి గతితప్పి ఏకంగా జంట మధ్య బంధం విచ్ఛిన్నం కూడా కావచ్చు. లైంగిక జీవితం బోరింగ్‌గా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ, నిత్య జీవితంలో చేసే కొన్ని పొరపాట్లు ఈ సమస్యను మరింత పెంచుతాయి. దంపతులు ఎలాంటి తప్పులు చేస్తే వారి లైంగిక జీవితాన్ని సంతోషంగా ముందుకు తీసుకెళ్తారో ఒకసారి తెలుసుకుందాం.
* భార్యాభర్తల మధ్య తగాదాలు తరచుగా వారి బంధంలో చిచ్చు పెడతాయి. దీని కారణంగా ఇద్దరి మధ్య దూరం రావడం మొదలై క్రమంగా ఇద్దరి మధ్య ప్రేమ కనుమరుగవుతుంది. మీరు మీ భాగస్వామితో మంచి లైంగిక జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటే, చిన్న విషయాలకు కోపం తెచ్చుకునే బదులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ద్వారా మీ కోపాన్ని తొలగించుకోండి.
* కొన్నిసార్లు అసమతుల్య హార్మోన్లు దంపతుల లైంగిక జీవితాన్ని కూడా భంగపరుస్తాయి. మీకు ఇలా అనిపిస్తే మాత్రం ఆలస్యం చేయకుండా మీ వైద్యుడిని సంప్రదించండి.
* నిద్ర లేకపోవడం అనేక విధాలుగా లైంగిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్ హార్మోన్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీని వల్ల హార్మోన్లు అసమతుల్యత చెందుతాయి. సంతానోత్పత్తికి అవసరమైన టెస్టోస్టెరాన్ వల్ల స్పెర్మ్ ఏర్పడుతుంది.
* ఆరోగ్యకరమైన లైంగిక జీవితం కోసం ఒక వ్యక్తి మంచి మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం. మంచి లైంగిక జీవితం స్త్రీ పురుషులిద్దరికీ సానుకూల శక్తిని ఇస్తుంది. దీని కారణంగా వ్యక్తి రిలాక్స్‌గా ఉంటాడు. మెదడులో సంతోషకరమైన హార్మోన్ల ప్రసరణ పెరుగుతుంది. మానసికంగా ఆరోగ్యకరమైన వ్యక్తి ఒత్తిడిని బాగా నిర్వహించగలడు. ఇది జంట కలిసిన సమయంలో ఏకాగ్రత, ఆనందాన్ని పెంచుతుంది. దింతో ఒత్తిడికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి.
* మీ శారీరక ఆరోగ్యం నేరుగా మీ లైంగిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అన్‌ఫిట్‌గా ఉండటం వల్ల మీ లైంగిక సామర్థ్యాన్ని తగ్గించుకోవచ్చు.
* కొన్నిసార్లు జంటల మధ్య సంతృప్తి చెందని శృంగారం వారి లైంగిక జీవితంలో సమస్యలను కూడా సృష్టిస్తుంది. ఈ సమస్యను అధిగమించడానికి డాక్టర్‌తో రెగ్యులర్ చెకప్‌లు చేయించుకోండి.