Leading News Portal in Telugu

Survey Reveals Jobs That Reduce the Risk of Alzheimer Disease


  • మతిమరుపు సమస్య అల్జీమర్స్.
  • ఆ పనులు చేసేవారికి అల్జీమర్స్ బారినపడే అవకాశం తక్కువ
  • వివరాలు ఇలా.
Alzheimer: ఆ పనులు చేసేవారికి అల్జీమర్స్ బారినపడే అవకాశం తక్కువట!

Alzheimer: బాధను మరిపించే మతి మరుపు కొందరికి వరం అయితే.. మరికొందరికి మాత్రం మనిషికి శాపం. మరీ ముఖ్యంగా, మధ్యవయసు వారిలో వెలుగు చూసే ఈ తీవ్ర మతిమరుపు సమస్య అల్జీమర్స్. అంతవరకు గడిపిన జీవితాన్ని, పరిసరాలను, ఆఖరికి తమకు ప్రాణమైన కుటుంబ సభ్యులను కూడా మర్చిపోవాల్సి వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. నిజానికి అల్జీమర్స్ కు సరైన చికిత్స లేదు. దాని బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే మన చేతిలో ఉంది. ఈ తరుణంలో తాజాగా నిర్వహించిన ఓ సర్వే.. అల్జీమర్స్ వ్యాధికి సంబంధించి కీలక అంశాలను వెల్లడించింది. మరీ ముఖ్యంగా కొన్ని రకాల ఉద్యోగాలు చేసేవారు అల్జీమర్స్ బారిన పడే మరణించే అవకాశం తక్కువగా ఉందని సర్వే తెలిపింది. ఇంతకు ఆ ఉద్యోగాలు ఏవి.. ఎందుకు వారు అల్జీమర్స్ బారిన పడే అవకాశం తక్కువగా ఉందన్నవిషయాలు చూద్దాము.

తరచుగా ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణాలు చేసే టాక్సీ, అంబులెన్స్ డ్రైవర్లు అల్జీమర్స్ బారిన పడి ప్రాణాలు కోల్సోయే అవకాశం తక్కువగా ఉందని తాజాగా నిర్వహించిన ఓ సర్వే వెల్లడించింది. నిజానికి అల్జీమర్స్ అనేది మెదడుకు సంబంధించిన వ్యాధి. ఈ వ్యాధికి గురైన వ్యక్తులు నెమ్మదిగా తమ మెమరీ కోల్పోతారు. ఈ వ్యాధి ఉన్న వ్యక్తిలో వారి జీవితంలో జరిగిన సంఘటనలు మొదలు వ్యక్తులు, ప్రాంతాలు.. చివరకు తమ రోజు వారి పనులను కూడా మర్చిపోతారు. అల్జీమర్స్ బారిన పడే వారిలో ఎక్కువగా వృద్ధులే అధికం. ఈ వ్యాధి పడిన వారిలో తరచుగా గందరగోళానికి గురి అవుతుంటారు, అలాగే మాట్లాడంలో కూడా సమస్యలను ఎదుర్కుంటారు. అల్జీమర్స్ బారిన పడ్డ వారిలో మెదడులోని కణాలు నశించడం, పని చేయడం ఆగిపోతాయి.