Leading News Portal in Telugu

Babies cry because of these reasons


Parent Tips: పసిపిల్లలు ఆకలితో మాత్రమే కాదు.. ఈ కారణాల వల్ల కూడా ఏడుస్తారు

పసి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం ప్రతి తల్లికి ఒక పెద్ద బాధ్యత. వల్లకి ఏం కాకుండా చూసుకోవడం, ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం చాలా కష్టం. అయితే పసి పిల్లలు ఏడవంగానే తల్లులంతా ఆకలితో ఏడుస్తున్నారు అని అనుకుంటారు. కానీ పెద్దవారు అనేక కారణాలతో ఏడ్చినట్టుగా.. పిల్లలు కూడా ఎన్నో కారణాలతో ఏడుస్తారు. అన్నింటికీ ఆకలే కారణం ఉండదు. ఇది ప్రతి ఒక్క తల్లీ తెలుసుకోవాలి.

* పాలు పట్టిస్తున్న కూడా తాగకుండా ఏడుస్తున్నారు అంటే దానికి కారణం ఉంటుంది. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లడం మంచిది. ఎందుకంటే అరుగుదల సరిగా లేక కూడా ఏడుస్తారు.

Newborn Crying | Crying Baby | Facts About Crying

* అలాగే కొంత మంది పిల్లలు పాలు తాగిన వెంటనే నిద్రపోతుంటారు. దీని వల్ల ఒక్కోసారి గ్యాస్ పట్టేసుంది. అలాంటప్పుడు కూడా పిల్లలు ఏడుస్తారు. అలాంటప్పుడు పిల్లల్ని ఎత్తుకొని వారి వీపుని సున్నితంగా తడితే గ్యాస్ బయటికి వస్తుంది. దీంతో వారు రిలాక్స్‌ అవుతారు.

My 4 week old shop cries all the time

* అలాగే కొంత మంది పడుకుని పిల్లలకు పాలు పడుతుంటారు దీని కారణంగా శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి. కనుక పిల్లలకు పాలు పట్టించే సమయంలో తల్లులు కూర్చుని పాలు ఇవ్వాలి.

How to Stop & Calm A Crying Baby | Kids Clinic Singapore

* అప్పుడప్పుడే తల్లిదండ్రులను గుర్తు పడుతున్న పిల్లలు అయితే ప్రతి చోట జిదు చేస్తూ ఉంటారు. కొత్త ముఖాలు కనిపించడం, ఎక్కువ లైటింగ్, ఎండ ఇలా ఏవైనా ఒకసారి కనిపించడం వల్ల కూడా పిల్లలు భయపడి ఏడుస్తాడు. అలాంటప్పుడు వారిని సైలెంట్‌గా, కాస్తా చీకటిగా ఉన్న గదిలోకి తీసుకెళ్ళి కాసేపు జో కొట్టడం మంచిది. అలా అని.. అనివెలల అలా ఉండాలి అని కాదు . పిల్లలను బయట తిప్పుతూ ఉంటే వారిలో తెలివి ఎక్కువ అవుతుంది. భయపడటం ఏడవడం లాంటి సమస్యలు తగ్గుతాయి.

A study identifies the cause of infant crying in order to improve the  infant-parent relationship

* మారుతున్న కాలం పెద్దవారిని అనారోగ్యాలకు గురి చేస్తూ ఉంటుంది. అలాటప్పుడు పిల్లలను మరింత జాగ్రత్తగా కాపాడుకోవాలి. పిల్లలు మరీ వేడిగా ఉన్న ప్రదేశంలో అయినా, చల్లగా ఉన్న పద్రేశంలో అయినా తట్టుకోలేరు. అలాంటప్పుడు ఏడుస్తారు.

Picking up a crying baby will spoil them| Medanta Cares | Medanta

* మాటలు వచ్చేంత వరకు వారికి ఏడుపు మాత్రమే పెద్దలతో ఉండే కనెక్షన్.. దీంతో వారి సమస్యను తెలియజేస్తారు. కాబట్టి, వారు కాస్త అలసిపోయినా, లేదా విసుగ్గా ఉన్నా ఏడుస్తారు. కనుక పిల్లలతో తల్లి ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ,ఆడిస్తూ ఉండాలి. బొమ్మలు ముందు పడేసి మీ పని మీరు చూసుకుంటాం అంటే కుదరదు. ఇలా చేయడం వల్ల పిల్లలు చాలా లేట్ గా ఎదుగుతాడు అని నిపుణులు చెబుతున్నారు.

Is It Ok To Let A 1 Year Old Cry It Out - Otosection

* తడిసిపోయిన చెడ్డి అయిన, న్యాపీ అయిన పిల్లలకు చిరాగ్గా ఉంటుంది. వారి లేత చర్మం ఇరిటేట్ అవుతుంది. అందువల్ల కూడా ఏడుస్తారు. రోజులో కొంత సేపైనా న్యాపీ లేకుండా పిల్లలని ఉండడానికి ట్రై చేయండి. ఫ్రీగా వదిలేయండి. బయటకు, ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు మాత్రమే న్యాపీ వేయడం మంచిది.

A Guide To Colic And Excessively Crying in Babies

* కొంత మంది తల్లులు వారి పిల్లల్ని, ఊయలలో లేదా మంచం మీద పడుకొబెట్టి వారి పని వారు చేసుకుంటారు. కానీ ఎక్కువ సేపు అలా పడుకోబెట్టడం వల్ల వాలు ఒంటరిగా ఫీలవుతారు. వాళ్ళకి అలవాటైన తల్లి స్పర్శ కావాలని కోరుకుంటారు. ఈ క్రమంలో ఏడుస్తారు అందుకే కాసేపు ఎత్తుకుని తిప్పి ముద్దులాడితే సర్దుకుంటారు. కానీ కొంత మంది తల్లులు చిరాకుగా పిల్లల్ని గట్టి గట్టిగా అరిచి భయపెడుతుంటారు. అలా చేయడం వారి మానసిక స్థితిని దెబ్బతీస్తుంది.

Neighbour Is Complaining About Our Baby Crying

ఇలా పిల్లలు ఏడవడానికి చాలా కారణాలు ఉంటాయి. కనుక పిల్లలను ఏడ్చినప్పుడు విసుకోకుండా, కారణం తెలుసుకోవడానికి ప్రయత్నించండి.