Leading News Portal in Telugu

Say goodbye to dandruff problem with Apple Cider Vinegar.


Apple cider vinegar : ఈ రెమిడీ తో డాండ్రఫ్ సమస్యకు గుడ్ బై చెప్పండి..

ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు జుట్టుకు సంబంధించిన ఏదో ఒక సమస్యతో బాధ పగుతున్నారు. ఒకరికి జుట్టు రాలడం సమస్య అయితే, మరొకరికి జుట్టు పెరగక పోవడం ప్రాబ్లం. ఇది మాత్రమే కాకుండా.. డాండ్రఫ్ సమస్యతో బాధపడేవారు మరెందరో. దీని తగ్గించడానికి ఖరీదైన షాంపూలు వాడుతుంటారు. కానీ కొంత మందికి ఎన్ని వాడినా డాండ్రఫ్ మాత్రం పూర్తిగా పోవడం కష్టం. ఇక  అలాంటి వారు ఈ రెమిడీ ఒక సారి వాడి ఈ డాండ్రఫ్ కి గుడ్ బై చెప్పండి..

ఆపిల్ సైడర్ వెనిగర్.. దీని గురించి మీరు వినే ఉంటారు. ఆపిల్ రసాన్ని పులియబెట్టడం ద్వారా ఆపిల్ సైడర్ వెనిగర్ తయారవుతుంది. ఇది కొద్దిగా పుల్లని రుచి, బలమైన వాసన కలిగి ఉంటుంది. దీని ఎక్కువగా ఈ మధ్య బరువు తగ్గడానికి ఉపయోగిస్తున్నారు. కానీ నిజానికి ఖాళీ కడుపుతో ఆపిల్ సైడర్ వెనిగర్ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుంది. అలాగే శరీర పనితీరు మెరుగుపడుతుంది. కానీ ఎముక సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ వెనిగర్ తీసుకోకూడదు.అంతే కాదు ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ చర్మం యవ్వనంగా కనిపించడానికి కూడా బాగా పనిచేస్తుంది.

అలాగే ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ హైర్ డాండ్రఫ్‌ను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. మరి దీని జుట్టుకు ఎలా రాసుకోవాలి ఇందులో ఇంకేం కలపాలి ఇప్పుడు చూదాం..

ముందు రెండు టీ స్పూన్ల ఆపిల్ సైడర్వెనిగర్, 2 టీ స్పూన్ల వాటర్, 4 నుంచి 5 కాటన్ బాల్స్ తీసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో మీ జుట్టుకు సరిపడా ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకొని అందులో వాటర్ కలపాలి. ఒక రెండు మూడు కాటన్ బాడల్స్ తీసుకుని, అందులో టిప్ చేసి నెమ్మదిగా జుట్టును పాయలుగా తీసుకుని తలకు పట్టించుకోవాలి. అప్లై చేయడం పూర్తయిన తర్వాత 30 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత ..జుట్టును వాటర్ తో కడిగి తలస్నానం చేయాలి.. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే మీ డాండ్రఫ్ పోతుంది. అంతే కాదు మీ జుట్టు హెల్తీ గా కూడా కనిపిస్తుంది.