Leading News Portal in Telugu

High blood pressure can cause many types of diseases,


  • అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్
  • శరీరంలో నిశ్శబ్దంగా వినాశనం
  • బీపీ వల్ల అనేక పలు రోగాలు
High Blood Pressure : బీపీ పెరిగితే ప్రమాదకరమైన రోగాలు..

అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎప్పుడూ ఏదో ఒక విధంగా తన ఉనికిని తెలియజేస్తూ ఉంటుంది. శరీరం లోపల ఉండి నిశ్శబ్దంగా వినాశనం కలిగిస్తుంది. ఆరోగ్యానికి పెద్ద ముప్పును కలిగిస్తుంది. అధిక రక్తపోటు ఆరోగ్యంపై కలిగించే చెడు ప్రభావం ఎలా ఉంటుందంటే.. అధిక రక్తపోటు గుండెపై అధిక ఒత్తిడిని కలిగిస్తుంది. గుండె సమస్యలకు దారితీస్తుంది. దీనివల్ల కరోనరీ ఆర్టరీ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలు ఇరుకైనవి. ఇవి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి. రక్తపోటు గుండె కండరాలను బలహీనపరుస్తుంది. ఈ పరిస్థితి నెమ్మదిగా గుండె వైఫల్యానికి దారితీస్తుంది. అధిక రక్తపోటు గుండె పోటును పెంచే అవకాశం ఉంది.

READ MORE: Bangladesh: బంగ్లాదేశ్‌కి డబుల్ షాక్.. ముందు అమెరికా, ఇప్పుడు స్విట్జర్లాండ్..

పక్షవాతం ముప్పు పెరుగుదల..
అధిక రక్తపోటుతో పక్షవాతం ముప్పు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల రక్తపోటు 120/80 మించకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ బీపీ ఎక్కువుంటే ఆహార, వ్యాయామ నియమాలతో తగ్గించుకునే ప్రయత్నం చేయాలని అంటున్నారు. అప్పటికీ అదుపులోకి రాకపోతే మందులు వేసుకోవాలని చెబుతున్నారు. 2019లో The Lancet Neurology జర్నల్​లో ప్రచురితమైన అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది.

READ MORE: Kejriwal: బీజేపీని గెలిపించేందుకే కాంగ్రెస్ పోటీ చేస్తోంది.. కేజ్రీవాల్ ఆరోపణలు

అధిక రక్తపోటుతో కళ్ల సమస్య..
దీంతో పాటు రక్తపోటులో మార్పులకు కళ్ళు సున్నితంగా ఉంటాయి. అధిక రక్తపోటు ఉన్న వ్యక్తులు దృష్టి సమస్యలను ఎదుర్కొంటారు. అధిక రక్తపోటు కళ్లకు సరఫరా చేసే రక్తనాళాలను దెబ్బతీస్తుంది, ఇది హైపర్‌టెన్సివ్ రెటినోపతికి దారితీస్తుంది.