- అరటి పండ్లను పోషకాల పవర్ హౌజ్ గా చెప్పుకుంటాం
- ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి.
- ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి

ఆపిల్ తో పోలిస్తే అరటి పండ్ల ధరలు చాలా తక్కువ. కానీ, ప్రయోజనాల్లో మాత్రం ఆపిల్ కి గట్టిపోటినిస్తుంది. అరటి పండ్లను పోషకాల పవర్ హౌజ్ గా చెప్పుకుంటాం. అరటిపండు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. ఇది ఏడాది పొడవునా మార్కెట్లో లభిస్తుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, పొటాషియం, విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ ఎ, మెగ్నీషియం మొదలైన అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మానసిక స్థితిని సమతుల్యం చేయడానికి, చర్మాన్ని రక్షించడానికి అరటిపండు అద్భుతంగా పనిచేస్తుంది. జీవిత కాలం ఆరోగ్యంగా ఉండడానికి రోజూ అరటిపండు తింటే చాలంటున్నారు నిపుణులు.
అరటిపండ్లలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రలోజ్ వంటి సహజ చక్కెరలు కార్బోహైడ్రేట్లు మెండుగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. అందువల్ల ఇది తక్షణ శక్తికి ఉత్తమమైన చిరుతిండిగా అరటిపండును చెప్పొచ్చు. అరటిపండులో విటమిన్లు A, C, B6 లతో పాటు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన మాంగనీస్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి. అరటిపండ్లలో కాల్షియం, మెగ్నీషియం లభిస్తాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి. అరటి పండు తినడం వల్ల ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
అరటిపండులో విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి చర్మాన్ని పోషించడంలో సహాయపడతాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అరటిపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అరటిపండులోని పెక్టిన్ ఉదర సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది బిపిని నియంత్రించడంలో మరియు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అరటిపండ్లలో విటమిన్ బి6 ఉంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గించడంలో సహాయపడుతుంది.