- రోజూ ఖర్జూరం తినడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు
- గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి ఉదర సమస్యల నుంచి ఉపశమనం
- మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది
- ఎముకలను బలంగా చేయడంలో సహాయపడతాయి

ఖర్జూరం సహజమైన తీపి, పోషకాలతో కూడిన పండు. ఇది రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రోజూ ఖర్జూరం తినడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు నిపుణులు. ఖర్జూరంలో అధిక మొత్తంలో సహజ చక్కెరలు (గ్లూకోజ్, ఫ్రక్టోజ్ మరియు సుక్రోజ్) ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అందుకే ఉదయం అల్పాహారంలో లేదా వ్యాయామం తర్వాత ఖర్జూరం తినడం మంచిది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరాలను ఆహారంలో చేర్చుకుంటే ఈ వ్యాధులు రమ్మన్నారావు అంటున్నారు నిపుణులు.
ఖర్జూరంలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది, ప్రేగులను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఖర్జూరం తినడం వల్ల గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి ఉదర సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఖర్జూరంలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది,.ఇది గుండెకు మేలు చేస్తుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఖర్జూరంలో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా చేయడంలో సహాయపడతాయి. ఆస్టియోపోరోసిస్ (ఎముకలు బలహీనపడటం) వంటి సమస్యలను నివారిస్తుంది.
ఖర్జూరంలో అధిక మొత్తంలో ఐరన్ ఉంటుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. రక్తహీనతతో బాధపడేవారికి ఖర్జూరం దివ్యమైన ఔషదం. ఖర్జూరాలలో విటమిన్లు సి, డి అలాగే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచుతాయి. ఖర్జూరంలో ఉండే విటమిన్ B6 మరియు ఇతర పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి.
ఖర్జూరంలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గర్భిణీ స్త్రీలకు ఖర్జూరాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది గర్భధారణ సమయంలో సంభవించే బలహీనత, రక్తహీనతను నివారిస్తుంది. ఖర్జూరంలో ఉండే పోషకాలు శిశువు అభివృద్ధికి తోడ్పడతాయి. ఖర్జూరంలో అధిక కేలరీలు ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి సహాయపడతాయి.