Leading News Portal in Telugu

The Importance of Sunscreen Lotion Protect Your Skin Year-Round


  • ఎలాంటి సీజన్‌తో సంబంధం లేకుండా సన్ స్క్రీన్ లోషన్లను ఉపయోగించడం చాలా ముఖ్యం.
  • UV కిరణాల నుండి రక్షణగా సన్ స్క్రీన్ లోషన్ పనిచేస్తుంది.
  • చర్మం స్వభావం బట్టి సన్ స్క్రీన్ లోషన్ ఎంపిక చేసుకోవాలి.
Sunscreen Lotion: సన్ స్క్రీన్ నిజంగానే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందా!

Sunscreen Lotion: ఏడాదిలో ఎలాంటి సీజన్‌తో సంబంధం లేకుండా మన చర్మాన్ని సూర్యుని కిరణాల ప్రభావం నుంచి కాపాడుకోవడానికి సన్ స్క్రీన్ లోషన్లను ఉపయోగించడం చాలా ముఖ్యం. చాలా మంది వేసవిలో మాత్రమే సన్ స్క్రీన్ వాడాలని అనుకుంటారు. కానీ.. ఏ కాలమైనా సరే సూర్యరశ్మి ప్రభావం నుండి చర్మాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. ఇక, సన్ స్క్రీన్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను ఒకసారి తెలుసుకుందాం. సూర్యుని కిరణాల ద్వారా మన శరీరానికి అవసరమైన విటమిన్ D లభిస్తుంది. అయితే, ఈ కిరణాలు కొంత మేరకు హానికరం కూడా అవుతాయి. UV కిరణాలు చర్మం లోపలికి చొచ్చుకుపోయి డ్యామేజ్ చేయడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండదు. అయితే, సన్ స్క్రీన్ ఉపయోగించడం వల్ల ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఇది స్కిన్ పొరను రక్షించి, హానికరమైన రశ్ములను తిప్పికొట్టే విధంగా పనిచేస్తుంది.

ఎవరైనా తమ చర్మం ఎప్పుడూ మెరిసేలా, యవ్వనంగా ఉండాలని కోరుకుంటారు. సన్ స్క్రీన్ ఉపయోగించడం వల్ల చర్మంపై ముడతలు రాకుండా ఉంటుంది. స్కిన్ టెక్స్చర్ మెరుగుపడి ఆరోగ్యంగా కనిపిస్తుంది. తరచుగా సన్ స్క్రీన్ వాడటం వలన సూర్యుడి ప్రభావంతో వచ్చే కాలువ పడటం, ముడతలు, మచ్చలు వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. చాలా మందికి ట్యానింగ్ ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ఎక్కువగా బయట తిరిగే వాళ్లకు సూర్య కిరణాల ప్రభావం వల్ల చర్మం కండరాలు ముదురుగా మారిపోతాయి. కానీ, సన్ స్క్రీన్ వాడటం ద్వారా ట్యానింగ్‌ను తగించుకోవచ్చు. ఇది చర్మాన్ని తగిన రీతిలో రక్షించి, దీని సహజ రంగును కాపాడుతుంది.

సన్ స్క్రీన్‌ని ప్రతి రెండు గంటలకి ఒకసారి అప్లై చేయాలి. మీరు స్ప్రే సన్ స్క్రీన్ వాడినా.. చెమట ఎక్కువగా పడుతున్నా లేదా ఈత కొట్టినా తర్వాత మళ్లీ అప్లై చేసుకోవాలి. ఇది నిరంతరం చర్మ రక్షణ కల్పించేలా ఉపయోగపడుతుంది. సన్ స్క్రీన్ లోషన్ లేదా క్రీమ్ అయినా కొంతమేరకు కెమికల్స్ ఉండే అవకాశముంది. ఈ కెమికల్స్ కొన్ని సున్నితమైన చర్మం కలిగిన వారికి ఇబ్బందులను కలిగించవచ్చు. ముఖ్యంగా, కాలం చెల్లిన సన్ స్క్రీన్ ఉపయోగిస్తే ముఖంపై ఇరిటేషన్ లేదా ఎర్రగా చర్మం మారి జిడ్డు చర్మంలా ఉండేలా సమస్యలు ఏర్పడతాయి.

చర్మానికి తగిన సన్ స్క్రీన్ ఎలా ఎంచుకోవాలన్న విషయానికి వస్తే.. సున్నితమైన చర్మం ఉన్నవారు ఆల్కహాల్ కలిగిన సన్ స్క్రీన్‌లను వాడకూడదు. చిన్న పిల్లలకు డై-ఆక్సీబెంజోన్ ఉన్న లోషన్లు ఉపయోగించకూడదు. సున్నితమైన చర్మం కలవారు 50+ SPF కలిగిన సన్ స్క్రీన్ ఉపయోగించడం మంచిది. జిడ్డు చర్మం ఉన్నవారు మాయిశ్చరైజర్ లేని సన్ స్క్రీన్ ఎంచుకోవాలి. పొడి చర్మం ఉన్నవారు మాయిశ్చరైజర్ కలిగిన సన్ స్క్రీన్ వాడాలి. మొత్తానికి చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచుకోవాలంటే సన్ స్క్రీన్ వాడటం తప్పనిసరి. ఇది వయస్సుతో వచ్చే ముడతలు, ట్యానింగ్, హానికరమైన UV కిరణాల ప్రభావాన్ని తగ్గించేందుకు సహాయపడుతుంది. కాబట్టి, సీజన్ ఎలా ఉన్నా సన్ స్క్రీన్ ని తప్పకుండా వాడండి. మీ చర్మాన్ని రక్షించుకోండి.