Leading News Portal in Telugu

If you follow these rules, success is yours!


  • విజయం సాధించాలని ప్రతి ఒక్కరికీ ఆశ
  • విజయం సాధించాలంటే కొన్ని నియమాలు పాటించాలి
  • మొదట లక్ష్యం లేని జీవితం వ్యర్థం
  • ఓ లక్ష్యాన్ని నిర్ధేశించుకోవాలి
Success Tips : మీరు ఈ నియమాలు పాటిస్తే.. విజయం మీ సొంత!

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని కోరుకుంటారు. కానీ విజయం సాధించాలంటే కష్టపడాలి. విజయం మనల్ని జీవితంలో కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది. కానీ వైఫల్యం మనల్ని భవిష్యత్తు ప్రణాళికలపై ప్రభావం చూపేలా చేస్తుంది. జీవితంలో వెనకడుగు వేసేలా చేస్తుంది. మన విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది కూడా. జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయానన్న బాధ ఎప్పుడూ ఉంటుంది. మీరు నిర్ణయించుకున్న ప్రతి అంశంలో విజయం సాధించాలంటే ఈ టిప్స్ పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • లక్ష్యం: లక్ష్యం లేని జీవితం వ్యర్థం. జీవితంలో పైకి ఎదగాలంటే ముందుగా ఓ లక్ష్యాన్ని నిర్ధేశించుకోవాలి. ఆ లక్ష్య సాధనకి కృషి చేయాలి.
    సంతోషం: సంతోషం, ఆనందం అనేవి కేవలం ఫీలింగ్స్ మాత్రమే కావు.. అదొక లైఫ్ స్టైల్ లాంటిది. మీరు చేసే పనితో మీరు సంతృప్తి లేనట్టయితే, అందులో విజయాన్ని పొందడం కష్టం. అందుకే చేసే పనిని ఇష్టంగా చేయడం అలవాటు చేసుకోండి. అందులోనే సగం విజయం మీ సొంతమైపోతుంది.
  • నమ్మకం: నమ్మకం ఒక్కటే మీ తలరాతని మార్చగలదు. చేసేపని పట్ల నమ్మకం కలిగి వుండండి. ఏదైనా సాధించగలం అని బలమైన నమ్మకం కలిగి వుండండి. అప్పుడే అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది.
  • పట్టుదల: మీరు చేసే పని ఏదైనా పట్టుదల ప్రదర్శించండి. మనం చేయడానికి ఇప్పుడు ఇదొక్క పనే వుందన్నట్టుగా పట్టుదలతో పనిచేయండి. మీకున్న పట్టుదలే మీకు విజయాన్ని సాధించిపెడుతుంది.
  • స్పూర్తి: నచ్చిన విషయాల నుంచి, వ్యక్తుల నుంచి స్పూర్తి పొందండి. ఆ ప్రేరణే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. విజయం వరకు వెంట తీసుకెళ్తుంది.
  • విశ్వాసం: మీరు తలుచుకుంటే చేయలేనిది అంటూ ఏదీ లేదు. ధృడమైన విశ్వాసం ఒక్కటే మిమ్మల్ని విజయవంతమైన మనిషిగా తీర్చిదిద్దుతుంది. మీలో వున్న శక్తిని మీరే నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు. అది గ్రహించినప్పుడే విజయం మీ దరి చేరుతుంది.
  • విలువలు: విలువలు పాటించే విషయంలో ఎప్పుడూ రాజీపడొద్దు. ఎందుకంటే విలువలు లేకుండా అడ్డదారిలోనూ విజయం సాధించొచ్చేమో కానీ ఆ విజయాలకి అంత విలువ వుండదు అని గ్రహించాలి. విలువలు లేని విజయం మీకు సరైన వ్యక్తిత్వం లేకుండా చేస్తుందనే సత్యాన్ని తెలుసుకోవాలి.
  • జీవితం పట్ల అవగాహన: జీవితం ఎలా వుండాలి అనే విషయంలో ఒక సరైన అవగాహన వుండాలి. జీవితం అలా వుండటం కోసం కృషిచేయాలి. అప్పుడే మీ కలలు నిజం అవుతాయి.
  • సవాళ్లు ఎదుర్కునేందుకు సిద్ధంగా వుండాలి: జీవితంలో ఎప్పుడైనా, ఏ సవాళ్లయినా ఎదురు కావచ్చు. ఆ సవాళ్లను ఎదుర్కోవడానికి వెనుకాడకుండా సిద్ధంగా వుండాలి.
  • వినయం, మర్యాద: జీవితంలో ప్రతీదీ నాకే తెలుసు! ఇక నేను నేర్చుకోవాల్సింది అంటూ ఏమీ లేదు అని అనుకోవద్దు. ఒకవేళ అలా అనుకున్నట్టయితే, ఆ క్షణమే సర్వం కోల్పోగలవు. అవతలి వారి నుంచి నేర్చుకోవాలనే జిజ్ఞాస, వారి పట్ల వినయ విదేయతలు, మర్యాదలు కలిగి వుండటమే అసలైన విన్నర్ లక్షణం.