Leading News Portal in Telugu

Drinking coconut water is very good for health


  • కొబ్బరి నీళ్లను తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు
  • శరీరంలో నీటి లోపాన్ని అధిగమించి హైడ్రేట్ గా ఉంచడంలో కీలక రోల్ ప్లే
  • కొబ్బరి నీటిలో గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు పుష్కలంగా
Coconut Water: ఈ వ్యాధులతో బాధపడుతున్నారా? కొబ్బరి నీళ్లు తాగి చెక్ పెట్టండి!

పూర్వ కాలం నుంచి కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి ఒక వరంలా మారాయి. కొబ్బరి నీళ్లను తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వైద్యులు సైతం కొబ్బరి నీటిని తాగాలని సూచిస్తూ ఉంటారు. శరీరంలో నీటి లోపాన్ని అధిగమించి హైడ్రేట్ గా ఉంచడంలో కీలక రోల్ ప్లే చేస్తాయి. కొబ్బరి నీళ్లలో లభించే పోషకాలు అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. కొబ్బరి నీటిలో గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ వ్యాధులతో బాధపడుతున్నవారు కొబ్బరి నీళ్లను తాగితే వాటికి చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు.

గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది

ప్రతిరోజూ కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా ప్రాణాంతకమైన గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. కొబ్బరి నీళ్లలో క్యాన్సర్ నిరోధక గుణాలు కూడా ఉన్నాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

రక్తపోటును నియంత్రించడంలో

కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా రక్తపోటును చాలా వరకు నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉదర సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి కొబ్బరి నీళ్లు బాగా పనిచేస్తాయని అంటున్నారు నిపుణులు.

ఊబకాయం నుంచి బయటపడవచ్చు
నిరంతరం బరువు పెరగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఊబకాయం నుంచి బయటపడాలనుకుంటే, ప్రతిరోజూ కొబ్బరి నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. కొబ్బరి నీళ్లలో లభించే పోషకాలు శరీర జీవక్రియను పెంచడం ద్వారా బరువు తగ్గడం ఈజీ అయిపోతుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.