Leading News Portal in Telugu

Causes of Dark Lips and How to Natural Ways to Get Pink Lips


  • అనేక కారణాల వల్ల నల్లగా మారుతున్న పెదవులు.
  • పెదవులు గులాబీ రంగులోకి రావాలంటే సహజ చిట్కాలు వాడాల్సిందే.
Lips Care: నల్లబారిన పెదవులను గులాబీ రంగులోకి ఎలా తెచ్చుకోవాలంటే?

Lips Care: ప్రస్తుత కాలంలో చాలామంది పెదవులు నల్లగా మారడంతో అనేకమంది ఇబ్బందులు పడుతున్నారు. ఇలా పెదవులు ఎక్కువగా నల్లదనం ఉంటే అది ఆరోగ్య సమస్యలను సూచించవచ్చు. ముఖ్యంగా పొగ త్రాగడం వల్ల పెదవులు నల్లబడతాయి. నిజానికి పెదవుల రంగు మన ఆరోగ్య స్థితిని తెలియజేస్తుంది. సహజంగా గులాబీ రంగులో ఉండే పెదవులు ఆరోగ్యంగా ఉన్నట్లు సూచిస్తాయి. కానీ, పెదవులు పొడిబారిపోతే లేదా నల్లబడితే అది శరీరంలో నీటి లోపాన్ని, ఐరన్ కొరతను లేదా ఏదైనా వ్యాధి కలగజేస్తుంది.

పెదవుల నల్లదనానికి కారణాల విషయానికి వస్తే.. సిగరెట్, బీడీ, ఇతర పొగ త్రాగే పదార్థాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల పెదవులు నల్లబడతాయి. పొగ త్రాగడం మానుకోవడం ఆరోగ్యానికి మేలుచేస్తుంది. కొన్నిసార్లు నాణ్యత లేని లిప్‌స్టిక్‌లను ఉపయోగించడం వల్ల పెదవుల రంగు మారిపోతుంది. దీనివల్ల పెదవుల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అలాగే కొంతమందికి ఎక్కువసేపు ఎండలో పనిచేయడం వల్ల పెదవులు నల్లబడే అవకాశం ఉంటుంది. సన్ ప్రొటెక్షన్ లేకుండా బయటకు వెళ్లడం కూడా పెదవుల రంగును ప్రభావితం చేస్తుంది. మరికొన్నిసార్లు మన దినచర్యలో మార్పులు, హార్మోన్ల అసమతుల్యత కారణంగా కూడా పెదవుల రంగు మారుతుంటుంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం అవసరం.

పెదవుల నల్లదనాన్ని పోగొట్టుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఉపశమనం పొందవచ్చు. రెండు నుండి నాలుగు చుక్కలు తేనె, రెండు నుండి నాలుగు చుక్కలు నిమ్మరసం కలిపి మిశ్రమం తయారు చేయాలి. దానిని పెదవులపై అప్లై చేసి, 5 నిమిషాల తర్వాత మృదువైన గుడ్డతో తుడిచి వేయాలి. ఇలా చేస్తే కొన్ని రోజుల్లో పెదవుల నల్లదనం తగ్గిపోతుంది. అలాగే, బంగాళాదుంపను చిన్న ముక్కగా కోసుకుని, రెండు మూడు నిమిషాలు పెదవులపై మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లో పెదవుల నల్లదనం తగ్గి, గులాబీ రంగు వస్తుంది.

ఇక ఇంట్లో ఉండే టూత్‌పేస్ట్‌ను తీసుకుని పెదవులపై అప్లై చేయాలి. టూత్‌బ్రష్ వెనుక వైపుతో రెండు నిమిషాలు మృదువుగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల పెదవులు గులాబీ రంగులోకి రావడానికి సహాయపడతాయి. ఇంకొ పర్శరాం విషయానికి వస్తే.. ఒక చెంచా వెన్నలో రెండు నుండి నాలుగు కుంకుమపువ్వు రేకల్ని కలిపి పెదవులపై అప్లై చేయాలి. దానిని ఉదయాన్నే తుడిచివేయాలి. ఇలా చేయడం వల్ల కొద్దిరోజులకే పెదవులు గులాబీ రంగులో మెరిసిపోతాయి. పెదవులు మరింత ఆరోగ్యంగా ఉండేందుకు.. రోజుకు కనీసం 2-3 లీటర్ల నీరు తాగాలి. ఐరన్, ఇతర పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. పొగ త్రాగడం, తక్కువ నాణ్యత గల లిప్‌స్టిక్ వాడడం మానుకోవాలి. పండ్లు, తాజా కూరగాయలను అధికంగా తీసుకోవాలి. ఈ చిట్కాలను పాటిస్తే, సహజమైన రీతిలో పెదవుల నల్లదనాన్ని తగ్గించుకోవచ్చు. ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం వల్ల పెదవులు సహజంగా గులాబీగా మెరిసిపోతాయి.