Leading News Portal in Telugu

It is better to drink hot water than cold water in summer.


  • వేసవిలో చల్లటి నీరు త్రాగకుండా ఉండలేము
  • చల్లటి నీరు తాగడం వల్ల ఆరోగ్యంపై చాలా ప్రభావం
  • వేసవిలో వేడినీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు.
Warm Water: వేసవిలో చల్లటి నీటి కంటే వేడి నీరు తాగితే మంచిది.. ఎన్ని బెనిఫిట్స్ అంటే..?

వేసవి కాలం వచ్చిందంటే చాలు చాలామంది చల్లటి నీరు త్రాగడానికి ఆసక్తి చూపుతారు. ఎండలో బయటకు వెళ్లి ఇంటికి వచ్చాక చల్లటి నీరు తాగకుండా ఉండలేరు. అయితే.. చల్లటి నీరు తాగడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో చాలా మందికి తెలియదు. నిజానికి, వేసవిలో వేడినీరు తాగడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వేడినీరు శరీరానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వేడినీరు తాగడం వల్ల శరీరానికి ఎన్నో అద్భత ప్రయోజనాలు ఉన్నాయి. అవెంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం….

కడుపు సమస్యలు తగ్గుతాయి:
గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇది కడుపులోని ఆహారాన్ని త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఉదయాన్నే పూటకోసం వేడినీరు త్రాగితే శరీరంలో టాక్సిన్లు బయటికి వెళ్లిపోతాయి.

జలుబు, దగ్గు నుంచి ఉపశమనం:
వేడి నీరు త్రాగడం వల్ల గొంతులోని మ్యూకస్ తొలగిపోతుంది.. గొంతు మంట తగ్గుతుంది. జలుబు, దగ్గు వచ్చినప్పుడు వేడినీరు త్రాగడం వల్ల శ్వాసకోశ వ్యవస్థ శుభ్రపడి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాకాలంలోనూ వేడినీరు త్రాగడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది:
వేడి నీరు జీవక్రియను పెంచి, శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. రోజూ ఉదయం గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల బొడ్డు చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవచ్చు. ఇది బరువు తగ్గేందుకు సహాయపడే సహజమైన మార్గం.

చర్మం కాంతివంతంగా మారుతుంది:
వేడి నీరు చర్మాన్ని లోతుగా శుభ్రపరచి, మొటిమలు, మచ్చలు తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మం మృదువుగా మారేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు వేడినీరు త్రాగడం చాలా మంచిది. రోజు రెండు లేదా మూడుసార్లు గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల చర్మం తేలికగా ప్రకాశవంతంగా మారుతుంది.

కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది:
వేడి నీరు కీళ్ల కండరాలను సడలించి, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. కీళ్ల వాపు సమస్యలు ఉన్నవారు గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల ఉపశమనం పొందుతారు. ముఖ్యంగా వయసు మీదపడే వారికి వేడినీరు త్రాగడం వల్ల కీళ్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.