- పెరుగుతున్న షుగర్ వ్యాధిగ్రస్థులు
- చిన్న వయసులోనే డయాబెటిస్
- జొన్న రొట్టెలు తింటే షుగర్ తగ్గుతుందా?
- పూర్తి వివరాలు తెలుసుకుందాం..

ఆహార మార్పుల వల్లనో, వాతావరణం వల్లనో చిన్న వయసులోనే చాలా మంది మధుమేహం పాలవుతున్నారు. దాంతో పాటు ఎన్నో ఇతర అనారోగ్య సమస్యలు కూడా వేధిస్తున్నాయి. వీటన్నిటినీ అదుపులో ఉంచేందుకు కొన్ని ఆహార పద్ధతులను పాటించాలంటున్నారు నిపుణులు. అయితే.. షుగర్ ఉన్న వాళ్లు అన్నానికి బదులుగా జొన్న రొట్టెలు తినాలని చాలా మంది చెబుతుంటారు. జొన్న రొట్టెలు తింటే డయాబెటిస్ తగ్గుతుందా? నిజంగానే జొన్న రొట్టేలు షుగర్‌ను కంట్రోల్ చేయగలవా? అనే అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
READ MORE: KTR vs Bhatti: కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడిన డిప్యూటీ సీఎం భట్టి..
ప్రపంచంలో మొదటి ఐదు ఆరోగ్యకరమైన ధాన్యాల్లో జొన్నలు కూడా ఉన్నాయి. జొన్నల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో ఉండడంతో పాటూ, గ్లూటెన్ ఉండకపోవడంతో వీటిని క్వినోవాతో పోలుస్తున్నారు. జొన్నలు ఆహారంగా తీసుకోవడం మనకి కొత్తేమీ కాదు. జొన్నల తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వరి బియ్యం తినేవారిలో త్వరగా జీర్ణమై రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. గోధుమలను తీసుకున్నా షుగర్ లెవల్స్ అలానే ఉంటాయి. కానీ, అదే సమయంలో జొన్నలు, రాగులు, సజ్జలు, అవిసెలు, క్వినోవా, ఓట్స్ ఏది తిన్నా సరే కాస్త ఆలస్యంగా జీర్ణం అవుతాయి. ఫలితంగా అంత త్వరగా రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరగవు. అయితే, వీటన్నింటిలో గ్లైసెమిక్ స్థాయులు ఒకేలా ఉంటాయి. ముఖ్యంగా రాగుల్లో మరింత ఎక్కువగా ఉంటుంది.
READ MORE: KTR vs Bhatti: కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడిన డిప్యూటీ సీఎం భట్టి..