Leading News Portal in Telugu

Amazing health benefits of drinking coconut water 3 days week


  • వారానికి 3 రోజులు కొబ్బరి నీళ్లు తాగితె
  • అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
  • జీర్ణక్రియ, చర్మం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి
Coconut Water: వారానికి 3 రోజులు కొబ్బరి నీళ్లు తాగితె.. అద్భుతమైన ప్రయోజనాలు

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే సీజన్ తో సంబంధం లేకుండా కొబ్బరి నీళ్లు తాగుతుంటారు. ఇక వేసవి కాలంలో కొబ్బరి నీళ్లు తాగడం వేరే రకమైన ఆనందం. దాహాన్ని తీర్చడమే కాకుండా, ఆరోగ్యానికి వరంలా పని చేస్తాయి. పురాతన కాలం నుంచి ఆయుర్వేదంలో కొబ్బరి నీటిని ఔషధంగా పరిగణిస్తున్నారు. ఇందులో ఉండే పోషకాలు జీర్ణక్రియ, చర్మం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే వారానికి 3 రోజులు కొబ్బరి నీళ్లు తాగితె అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

నేటి బిజీ లైఫ్ లో మనం తరచుగా నీరు త్రాగే అలవాటును మర్చిపోతుంటాము. దీనివల్ల శరీరం డీ హైడ్రేట్ అవుతుంది. కానీ కొబ్బరి నీళ్లు మీ శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా శక్తిని కూడా ఇస్తాయి. ఇందులో ఉండే ఎలక్ట్రోలైట్స్, పొటాషియం, మెగ్నీషియం శరీరాన్ని తక్షణమే తాజాగా ఉంచుతాయి. ముఖ్యంగా వేసవిలో శరీరం నుంచి అవసరమైన ఖనిజాలు చెమట రూపంలో విసర్జించబడినప్పుడు, కొబ్బరి నీరు ఈ లోపాన్ని భర్తీ చేయడానికి ఒక అద్భుతమైన మార్గంగా చెప్పొచ్చు. మీరు ప్రతిరోజూ కొబ్బరి నీళ్లు తాగలేకపోతే, వారానికి కనీసం మూడు రోజులైనా మీ ఆహారంలో చేర్చుకోండి. ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

జీర్ణ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి

మీరు తరచుగా మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ లేదా అసిడిటీ వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే , కొబ్బరి నీళ్లు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడే సహజ ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది. ఇవి శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడం ద్వారా ప్రేగులను శుభ్రపరుస్తుంది.

చర్మాన్ని ప్రకాశవంతంగా

ఖరీదైన చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించకుండా మీ చర్మం ప్రకాశవంతంగా, యవ్వనంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? అయితే మీ దినచర్యలో కొబ్బరి నీళ్లను చేర్చుకోండి. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి మీ చర్మం నుంచి విషాన్ని తొలగించడంలో సహాయపడతాయి. కొబ్బరి నీళ్లు చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. ఇది నీరసాన్ని తొలగిస్తుంది. ముడతలు, ఫైన్ లైన్లను తగ్గించడంలో సహాయపడతాయి. మొటిమలు, మచ్చలను నివారిస్తుంది. చర్మానికి సహజ మెరుపును ఇచ్చి, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. మూత్రపిండాలు, మూత్ర నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లు ఆరోగ్యాన్ని, అందాన్ని కూడా సంరక్షించే సహజ పానీయం.