Leading News Portal in Telugu

Common Reasons for Late Periods in Women – A Natural and Medical Overview


  • సృష్టిలో భాగంగా ఆడవారికి పీరియడ్స్ అనేవి సహజం.
  • నెలసరి ఆలస్యం కావడానికి అనేక కారణాలు
  • వైద్యుడిని సంప్రదించి సరైన పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి.
Menstruation Period: నెలసరి ఆలస్యం కావడానికి కారణాలు ఇవే.. జాగ్రత్త పడకపోతే అంతే సంగతి!

Menstruation Period: సృష్టిలో భాగంగా ఆడవారికి పీరియడ్స్ అనేవి రావడం సహజం. దీనిని “రుతుక్రమం” అని కూడా పిలుస్తారు. ఈ నెలసరి అనేది స్త్రీల శరీరంలో జరిగే ఒక సహజమైన ప్రక్రియ. కొన్ని నివేదికల ప్రకారం ఈ చర్య ప్రతి 28 రోజుల చక్రంలో ఒకసారి జరుగుతుంది. కాకపోతే, ఈ పక్రియ ఒక్కొక్కరిలో ఒక్కోకోలా భిన్నంగా ఉంటుంది. ఇందులో భాగంగా 20 రోజుల నుంచి 35 రోజుల మధ్యలో ఆడవారికి ఇవి వస్తుంటాయి.

నిజానికి పీరియడ్స్ సమయం 3 నుంచి 7 రోజుల వరకు ఉంటుంది. పీరియడ్స్ సమయంలో గర్భాశయం లోపలి పొర విచ్ఛిన్నం జరిగి రక్తస్రావం జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు కడుపు నొప్పి, నడుము నొప్పి, మానసిక స్థితిలో మార్పులు వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇకపోతే స్త్రీల పీరియడ్స్ ఆలస్యమయ్యే కారణాలు అనేకంగా ఉండవచ్చు. ఇది ఒక్కో స్త్రీకి ఒక్కో రీతిగా ఉంటుందనీ, దాని వెనుక ఉన్న కారణాలు భిన్నంగా ఉండవచ్చుని గుర్తుంచుకోవాలి.

ఇందులో ముఖ్యంగా గర్భధారణ (pregnancy) ప్రథమంగా పరిగణించవలసిన ముఖ్యమైన కారణం. అదేవిధంగా హార్మోన్ల అసమతుల్యత (hormonal imbalance), థైరాయిడ్ సమస్యలు లేదా పాలిసిస్టిక్ ఒవరీ సిండ్రోమ్ (PCOS) వంటి పరిస్థితులు కూడా పీరియడ్స్ ను ప్రభావితం చేస్తాయి. అధిక ఒత్తిడి, శరీర బరువులో మార్పులు, అతిగా వ్యాయామం చేయడం లేదా తగినంత నిద్ర లేకపోవడం కూడా పీరియడ్స్‌లో ఆలస్యం తలెత్తించే అవకాశం ఉంది. అంతేకాకుండా కొన్ని మందుల వాడకాలు, ప్రత్యేకంగా హార్మోన్ ఆధారిత మందులు వాడకం కూడా ప్రభావం చూపవచ్చు. అలాగే పర్యావరణ మార్పులు, డైట్లో మార్పులు లేదా తీవ్రమైన వ్యాధులు కూడా ఈ సమస్యలకు ఒక రకంగా కారణమవుతాయి. కాబట్టి, పీరియడ్స్ ఆలస్యమయ్యే పరిస్థితి కొనసాగితే, వైద్యుడిని సంప్రదించి సరైన పరీక్షలు చేయించుకోవడం మంచిది. లేకపోతే అనేక సమస్యల పరిష్కారానికి దారితీస్తుంది.