- హార్మోన్ల ప్రభావంతో పురుషులకు గుండెపోటు ముప్పు అధికం
- ఈస్ట్రోజన్ రక్షణ మహిళలకు కలిసొస్తుంది
- రుతుచక్రం సమయంలో ఈస్ట్రోజన్ గుండెను రక్షించడంలో సాయపడుతుంది
- 45 ఏళ్ల తర్వాత పురుషుల్లో ముప్పు పెరుగుతుంది
- ఈ వయస్సు తరువాత గుండెపోటు నిష్పత్తి 1:10గా ఉంటుంది

ఆధునిక కాలంలో గుండె ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యయనాల ప్రకారం మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే అధికంగా గుండెపోటు సమస్య వస్తుందని తేలింది. ఎందుకు పురుషుల్లో ఎక్కువగా వస్తుందో ఇప్పుడు తెలుసుకుంది. మహిళల్లో ఈస్ట్రోజెన్, పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్‌లు ఎక్కువగా ఉంటాయి. మహిళల్లో రుతుచక్రం కొనసాగేటప్పుడు రక్తంలో ఈ ఈస్ట్రోజెన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. రుతుచక్రం అనేది గుండె పోటు నుంచి మహిళలకు కొంతవరకు రక్షణలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 45 ఏళ్లకు పైబడిన మహిళలతో పోలిస్తే పురుషులకు ఎక్కువగా గుండె పోటు వస్తుంది. ఈ రెండు వర్గాల మధ్య గుండె పోటు నిష్పత్తి 1:10గా ఉంటుంది. అంటే ఒక మహిళకు గుండెపోటు వస్తే అటువైపు పది మంది పురుషులకు గుండె పోటు వస్తోంది అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
READ MORE: Crime: పిల్లల ముందే భార్యని క్రూరంగా కొట్టి చంపిన కసాయి..
మహిళల్లో ఈస్ట్రెజెన్ స్థాయిలు తగ్గిపోయినప్పుడు మెనోపాజ్ వస్తుంది. అప్పుడు వారిలో గుండె పోటు ముప్పు పెరుగుతుంది. అంటే దాదాపు 60ల వయసులో రెండు వర్గాల మధ్య గుండెపోటు ముప్పు ఒకేలా ఉంటుంది. 65 ఏళ్ల తర్వాత పురుషుల్లో కంటే మహిళల్లో ఎక్కువ గుండె పోటులు వస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే ఇటు మహిళలు, అటు పురుషులూ.. రెండు వర్గాలూ తీసుకునే ఆహారం, వ్యాయామంపై దృష్టి పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు. యువకుల్లో గుండె పోటుకు జీవన శైలిలో మార్పులే కారణంగా చెప్పుకోవాలి. ధూమపానం, మద్యం సేవించడం, మైదాతో చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం లాంటివి ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.