Leading News Portal in Telugu

Saggu Biyyam Health Benefits – NTV Telugu


  • శరీరానికి అద్బుతంగా మేలు చేసేవాటిల్లో సగ్గు బియ్యం ఒకటి
  • విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, కాల్షియం, ప్రోటీన్స్ ఇలా ఎన్నో రకాల పోషకాలు
  • ఇందులో లభించే కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచేందుకు తోడ్పడుతుంది
Health Tips: సగ్గు బియ్యం ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

సగ్గు బియ్యం.. పేరులోనే బియ్యం ఉందని పంట నుంచి వచ్చాయనుకుంటే పొరపాటే. సగ్గు బియ్యాన్ని పరిశ్రమల్లో తయారు చేస్తారు. చాలా మంది వీటిని కేవలం పిండి వంటలకు మాత్రమే ఉపయోగిస్తారు. ఆ తర్వాత అసలు వీటి గురించి పట్టించుకోవడమే మానేస్తారు. కానీ.. మన శరీరానికి అద్బుతంగా మేలు చేసేవాటిల్లో సగ్గు బియ్యం ఒకటి. ఇందులో విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, కాల్షియం, ప్రోటీన్స్ ఇలా ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. కేవలం 100 గ్రాముల సగ్గు బియ్యం తీసుకుంటే మన బాడీకి 355 క్యాలరీలు, 94 గ్రాముల కార్బోహైడ్రేట్స్, కొవ్వులు లభిస్తాయి. న్యాచురల్ గా బరువు తగ్గాలనుకునే వారికి ఇవి అద్భుతంగా ఉపయోగపడతాయని నిపుణులు సూచిస్తున్నారు.

ఇందులో ఉండే పోషకాలు బీపీని కంట్రోల్ చేస్తాయి. అలాగే.. జీర్ణ సమస్యలు ఉన్నవారికి సగ్గు బియ్యం అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. ఈ బియ్యాన్ని జావగా కాచుకుని తీసుకోవడం వల్ల బాడీలో వేడి తగ్గుతుంది. శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించుకోవడానికి సగ్గు బియ్యం ఉపయోగపడతాయి. ఈ బియ్యంలో ఉండే విటమిన్ కె మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్యాస్ సమస్యలకు ఇది రారాజులగా పనిచేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. కండరాల బలోపేతానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఇందులో లభించే కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. ఎలాంటి రసాయనాలు లేని న్యాచురల్ స్వీట్ నర్ గా సగ్గు బియ్యాన్ని చెప్పవచ్చు. వీటిని నిపుణుల సలహా మేరకు తగినంతగా తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందంటున్నారు నిపుణులు.