
Awake At Midnight: ప్రస్తుతం బిజీ లైఫ్ లో కాలంతో పాటు.. ప్రజల జీవనశైలిలో కూడా అనేక భారీ మార్పులు వచ్చాయి. సాయంత్రం అవ్వగానే ప్రజలు తమ పడకలపై పడుకునే రోజులు ఇప్పుడు పూర్తిగా కనుమరుగయ్యాయి. ప్రస్తుతం చాలామందికి రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం అలవాటుగా మారింది. ముఖ్యంగా నేటి యువత ఎటువంటి కారణం లేకుండా కూడా అర్థరాత్రి వరకు మేల్కొని ఉండటానికి ఇష్టపడుతోంది. ఈ నిద్ర విధానం ప్రజల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ప్రతి రాత్రి మీరు ఎక్కువసేపు మేల్కొని ఉండి, మీకు రోజులో కనీస అవసరమైన 8 గంటల మంచి నిద్ర రాకపోతే.. ఇది మీ మెదడును ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి, రాత్రిపూట ఆలస్యంగా మేల్కొని ఉండటం వల్ల మెదడుపై కలిగే దుష్ప్రభావాలు ఏమిటో తెలుసుకుందాం.
మానసిక స్థితిపై చెడు ప్రభావం..
మీరు రాత్రి పొద్దుపోయే వరకు మేల్కొని ఉండి సరైన నిద్ర పట్టకపోతే.. రోజంతా ఒక విధమైన చిరాకు కొనసాగుతుంది. ఇది మీరే గమనించి ఉండవచ్చు. ఏ పని చేయాలని అనిపించకపోవడం, రోజంతా అలసిపోయి నిద్రపోతున్నట్లు అనిపిస్తుంది. నిజానికి మన మానసిక స్థితి, నిద్ర ఒకదానికొకటి అనుసంధానించబడి ఉంటాయి. కాబట్టి, మీరు మీ రోజును వృధా చేయకూడదనుకుంటే సమయానికి నిద్రపోయి తగినంత నిద్ర పొందండి.
బరువు వేగంగా పెరగవచ్చు..
బరువు తగ్గడానికి సరైన ఆహారం, శారీరక శ్రమ మాత్రమే కాదు.. తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యం. నిజానికి, నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది అతిగా తినాలనే కోరికను పెంచుతుంది. దింతో మీరు అతిగా తింటారు. కాబట్టి క్రమంగా మీ బరువు పెరగడం ప్రారంభమవుతుంది.
ఒత్తిడి పెరగవచ్చు:
తగినంత నిద్ర సరిపోనప్పుడు మీ ఒత్తిడి స్థాయి కూడా పెరుగుతుంది. మీకు సరైన నిద్ర లేనప్పుడు, విషయాల పట్ల మీ దృక్పథం చాలా ప్రతికూలంగా మారుతుందని అనేక అధ్యయనాలలో వెల్లడైంది. సులభంగా పరిష్కరించగలిగే విషయాలను కూడా, మీరు వాటిని సాధించలేకపోతారు. ఇది ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి మానసిక ఆరోగ్య సమస్యల మరింత ప్రమాదాన్ని పెంచుతుంది.
ఆలోచించే సామర్థ్యం ప్రభావితం:
రాత్రి సమయంలో ఆలస్యంగా మేల్కొని ఉండటం, తక్కువ నిద్రపోవడం కూడా రోజంతా ఆలోచించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మీరు తక్కువ నిద్రపోయినప్పుడు, మీరు దేనిపైనా సరిగ్గా దృష్టి పెట్టలేరు. అందువల్ల, మీరు ఏదైనా గురించి లోతుగా ఆలోచించవలసి వస్తే లేదా ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసి వస్తే, అది మీకు చాలా సవాలుతో కూడిన పనిగా మారవచ్చు.
వైద్యుడి సలహా:
మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే, మీ నిద్ర విధానాన్ని మెరుగుపరచుకోవాలని డాక్టర్స్ సూచిస్తున్నారు. అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండటానికి బదులుగా, సరైన సమయాన్ని నిర్ణయించుకుని ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోండి. ఈ విధంగా మీ నిద్ర సరిగా ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా, ప్రతిరోజూ కనీసం ఏడు నుండి ఏమిమిడి గంటలు ఖచ్చితంగా నిద్రపోవడానికి ప్రయత్నించండి.