
Pistachio Nuts: ప్రస్తుత జీవనశైలిలో చాలామంది గుండె సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరికితే ఉన్నటు ఉండి గుండెపోటుకు గురై చివరకు చనిపోతున్న వారి గురించి కూడా మనం ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నాము. అదికూడా ఎలాంటి వయసుతో సంబంధం లేకుండా గుందె వ్యాధులకు ప్రజలు బలి అవుతున్నారు.
ఇకపోతే, పిస్తా గింజలు (Pistachio nuts) ఆరోగ్యానికి మేలు చేసే పోషక విలువలతో నిండిన ఆహార పదార్థం. ఇవి ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఇంకా అనేక ఖనిజాలతో సమృద్ధి ఆహారంగా ఉంటాయి. ప్రతి రోజు కొద్దిపాటి పిస్తాలను తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా, ఈ పిస్తా గింజల్లో ఉండే మోనోసాచురేటెడ్, పాలీసాచురేటెడ్ కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడతాయి. ఇవి రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడానికి దోహదపడుతాయి.
ఇక ఈ పిస్తా తినడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాల్లో ముఖ్యమైనవిగా.. మనిషి శక్తి స్థాయులు పెరగడం, గుండె జబ్బుల రిస్క్ తగ్గడం, అలాగే రోగనిరోధక శక్తి బలపడటం ఇంకా కంటి ఆరోగ్యం మెరుగవడం లాంటివి చెప్పుకోవచ్చు. పిస్తాల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు ముఖ్యంగా ల్యూటిన్, జెక్సాంథిన్ లు కళ్లను హానికరమైన కాంతి నుండి రక్షిస్తాయి. అంతేకాక, వీటిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి కూడా పిస్తాలు మంచివిగా ప్రభావం చూపెడతాయి. ఎందుకంటే, ఇవి రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రించడంలో ఎంతగానో సహాయపడతాయి. అంతేకాకుండా, పిస్టాల్లో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇది శరీర శక్తి పెంపుకు, శరీరం బలంగా ఉండేందుకు దోహదపడుతుంది. కొద్ది మోతాదులో ప్రతిరోజూ పిస్తా గింజలను తీసుకోవడం ఆరోగ్యాన్ని బలపర్చే సహజ మార్గంగా చెప్పవచ్చు.