
Beauty Tips: వేసవికాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లో పుచ్చకాయలు దర్శనమిస్తాయి. దీనిని తినడం ద్వారా వేసవి తాపం నుండి కొద్దీ మేర ఉపశమనం పొందవచ్చు. ఇక పుచ్చకాయలో పొటాషియం, మెగ్నీషియం యాంటీఆక్సిడెంట్లతో పాటు విటమిన్ ఎ, విటమిన్ సి వంటివి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా మేలు చేస్తాయి. పుచ్చకాయ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. వేసవి కాలంలో పుచ్చకాయ వంటి జ్యుసి పండ్లు తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ సమస్య నుండి బయట పడవచ్చు. పుచ్చకాయలో తగినంత నీరు ఉంటుంది. దీన్ని తినడం వల్ల ఆరోగ్యంతో పాటు, మొటిమలు, ముడతలు, మచ్చలు వంటి చర్మ సంబంధిత సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. అయితే, చర్మాన్ని మెరిసేలా చేయడానికి పుచ్చకాయ రసాన్ని ముఖానికి రాసుకోవచ్చనిచాలామందికి తెలియదు.
ఇప్పటి వరకు, మీరు పుచ్చకాయ రసాన్ని ముఖంపై పూయడం గురించి విన్నారా? వినడానికి వింతగా అనిపించినా కానీ.. మీరు పుచ్చకాయ రసాన్ని మీ ముఖానికి రాసుకోవచ్చు. ఇలా రాసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేంటో ఒకసారి చూద్దామా..
పుచ్చకాయ రసాన్ని ముఖానికి రాసుకోవడం వల్ల.. చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. దీనితో చర్మం సహజ మెరుపును కాపాడుతుంది. ఇది ముఖం పొడిబారడాన్ని తగ్గించడంలో సహాయపడే హైడ్రేటింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. పుచ్చకాయలో యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉండడం వల్ల దీని రసాన్ని ముఖానికి రాసుకోవడం వల్ల మొటిమల సమస్య తొలగిపోతుంది. పుచ్చకాయలోని విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి.. ఇది ముఖంపై ఉన్న మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. దానితో చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. మెరిసే చర్మాన్ని పొందడానికి, మీరు పుచ్చకాయ రసంలో కొద్దిగా పాలు కలిపి ముఖానికి రాసుకుని అది ఆరిన తర్వాత, చల్లటి నీటితో ముఖాన్ని కడిగితే, ఇది మీ ముఖంపై సహజమైన మెరుపును తీసుకురావడానికి సహాయపడుతుంది.