Leading News Portal in Telugu

Soaring Heat in Telugu States: Expert Tips to Stay Healthy and Beat the Summer


  • రోజు రోజుకూ పెరుగుతన్న ఊష్ణోగ్రతలు
  • బయటకు వెళ్లాలంటే జంకుతున్న జనాలు
  • వేసవిలో కొన్ని చేయకూడని పనులు
  • ఈ జాగ్రత్తలు పాటించాలన్న నిపుణులు
Summer Tips: వేసవిలో ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. లేదంటే చాలా ప్రమాదం…

రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు ఎండలు మండుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటకు వెళ్లాలంటే భానుడి భగభగలు చెమటలు పుట్టిస్తున్నాయి. అత్యవసరమైతే తప్పా బయటకు వెళ్లడం లేదు. ఇలాంటి పరిస్థితులతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. చాలా మంది త్వరగా అనారోగ్యం పాలవుతున్నారు. అయితే.. రోజువారీ పనులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా, ఆరోగ్యంగా ఉండాలంటే సమ్మర్ లో కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి. నిపుణులు చెబుతున్న ఈ జాగ్రత్తలు పాటించాలి.

READ MORE: Off The Record: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేపై సొంత నేతలే ఫైర్.. బీఆర్ఎస్ మాత్రం అతన్ని ఏం అనొద్దని ఆర్డర్స్..?

మన బాడీ కొంత వరకూ ఎండలను తట్టుకుంటుంది. కానీ ఇప్పుడు ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువైపోతున్నాయి. కాసేపు బయట నిలబడితేనే ఒళ్లంతా మంటలు పుడుతున్నాయి. చర్మం కూడా దెబ్బ తింటోంది. ఇలాంటప్పుడే వడదెబ్బ కూడా తగులుతోంది. అందుకే ఎండ విపరీతంగా ఉన్నప్పుడు వీలైనంత వరకూ బయట తిరగకపోవడమే మంచిది. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలోనే వడదెబ్బ సహా మరి కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా కచ్చితంగా క్యాప్ వాడాలి. వదులు దుస్తులు వేసుకోవాలి. వెంట ఓ వాటర్ బాటిల్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

READ MORE: Pakistan Army: పాకిస్తాన్ ఆర్మీకి వేల కోట్లలో వ్యాపారాలు.. వ్యవసాయం దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ దాకా..

వాతావరణ మార్పులకు అనుగుణంగా మన ఆహారంలోనూ మార్పులు చేసుకోవాలి. ఈ వేసవిలో వేడి చేసే పదార్థాలకు దూరంగా ఉండడమే మంచిది. ఇంట్లో చేసిన ఆహార పదార్థాలే తినాలి. లైట్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. వేపళ్లు, పచ్చళ్లు, ఆయిల్ ఫుడ్స్ లాంటివి అవాయిడ్ చేయడమే బెటర్. ఇవి తినడం వల్ల శరీరంలో ఇంకా వేడి చేస్తుంది. బయట ఉష్ణోగ్రతలతో పాటు శరీరంలోనూ వేడి పెరిగితే అది ఆరోగ్యానికి మంచిది కాదు. పైగా విపరీతంగా ఆయిల్ ఫుడ్ తినడం వల్ల వేసవిలో జీర్ణ సమస్యలు వస్తాయి. కొన్ని సార్లు ఇది వాంతులు, విరేచనాలకు దారి తీస్తుంది. అందుకే బయట ఫుడ్ తినడం మానేసి ఇంటి ఫుడ్ కే ప్రాధాన్యత ఇవ్వాలి.

READ MORE: Virat Kohli: కోహ్లీని పక్కన పెట్టిన ఢిల్లీ.. అసలు విషయం బయట పెట్టిన సెహ్వాగ్..

రోజూ వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదే. కానీ వేసవిలో మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బయట చేయాల్సిన వ్యాయామాలను ఉదయం కాకుండా సాయంత్రం కాస్త చల్లబడ్డాక చేసుకోవాలి. లేదా ఉదయం పూట మరీ ఎండ కాక ముందే ప్లాన్ చేసుకోవాలి. వేడి ఎక్కువగా ఉన్నప్పుడు బయట వ్యాయామం చేస్తే ఆరోగ్యం దెబ్బ తింటుంది. త్వరగా నీరసపడిపోతారు. పైగా డీహైడ్రేషన్ కి గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. వీలైనంత వరకూ వేసవిలో ఆరుబయట కాకుండా ఇంటి లోపలే ఎక్సర్ సైజ్ చేసుకుంటే మంచిది.

READ MORE: Manchu Vishnu: పహల్గమ్ బాధిత కుటుంబాన్ని దత్తత తీసుకున్న మంచు విష్ణు

బయటకు వెళ్లినప్పుడు చెప్పులు వేసుకోవడం మనకు అలవాటే. కానీ..అవి ఎలా ఉన్నాయనే దాన్ని బట్టి కూడా వేసవిలో మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. వేసవిలో వేడికి పాదాలు పగిలిపోతుంటాయి. ఇలాంటి ఇబ్బంది లేకుండా సాఫ్ట్ గా ఉండే చెప్పులు లేదా షూస్ వేసుకోవాలి. వీలైనంత వరకూ పాదాలపై ఒత్తిడి పడకుండా చూడాలి. పాదాల్లో వేడిని పెంచే చెప్పులు అవాయిడ్ చేయాలి. సౌకర్యంగా ఉండేవి మాత్రమే ధరించాలి. టైట్ చెప్పులు, షూస్ ని పక్కన పెట్టేయాలి.